కేసీఆర్ వి సొంత రాజకీయాలు.. డీకే అరుణ విమర్శనాస్త్రాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా సొంత రాజకీయాలు కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు.

అందుకే కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు.పార్టీ పేరు మార్చుకున్నా టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని ధీమా వ్యక్తం చేశారు.

అసలు కేసీఆర్ కు ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే అర్హత లేదని ఎద్దేవా చేశారు.బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల కలలు నెరవేరతాయని డీకే అరుణ స్పష్టం చేశారు.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement