కమిషన్ కు కేసీఆర్ లేఖ... కాంగ్రెస్ ఆగ్రహం 

గత బీఆర్ఎస్ ( BRS )ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసిన విద్యుత్ ఒప్పందాల వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.

ఆ ఒప్పందంలో భారీగా అవుతవకలు జరిగాయని, దీంట్లో బిఆర్ఎస్ పెద్దలు అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.

దీనిపై జస్టిస్ నరసింహారెడ్డి( Justice Narasimha Reddy ) కమిషన్ ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇప్పటికే కేసీఆర్ కు దీనిపై వివరణ ఇవ్వాలని కమిషన్ నోటీసులు ఇచ్చింది.

దీనిపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు కెసిఆర్ లేక ద్వారా వివరణ ఇచ్చారు.విద్యుత్ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి తీరు సరిగా లేదని , అందువల్లే ఈ ఎంక్వైరీ బాధ్యతలు నుంచి నరసింహారెడ్డి స్వచ్ఛందంగా తప్పుకోవాలని లేఖలో కేసీఆర్ ( KCR )పేర్కొన్నారు.

దీంతో ఈ వ్యవహారం రచ్చగా మారింది .కేసీఆర్ లేఖ పై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది .

Kcrs Letter To The Commission Angered The Congress , Brs, Bjp, Congress, Telang
Advertisement
KCR's Letter To The Commission Angered The Congress , BRS, BJP, Congress, Telang

 కేసీఆర్ విమర్శల పై కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ రావు ( Dayakar Rao )ఘాటుగా సమాధానం ఇచ్చారు.  కేసీఆర్ ఇలా బెదిరించే ధోరణి సరికాదని,  ఎవరినో నిందితులుగా చేయడం కోసం విచారణ చేయడం లేదని , తనను తన ప్రభుత్వం పేరును బద్నాం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం విచారణ జరుపుతోంది అని అనడంలో ఎటువంటి అర్థం లేదని దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు .గత ప్రభుత్వంలో అన్ని చేసింది మీరే కదా అని దయాకర్ ప్రశ్నిస్తున్నారు.  అన్ని శాఖలలో మీరు చెప్పింది వేదం అన్నట్లుగా నడిచిందని , అప్పుడు మంత్రులు చేసేదేముంది.

ఇప్పుడు విచారణలో పేరు రాగానే కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారని దయాకర్ విమర్శించారు.తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ కూడా స్పందించింది.

Kcrs Letter To The Commission Angered The Congress , Brs, Bjp, Congress, Telang

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పై బిజెపి సీనియర్ నేత ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ మాట్లాడారు .విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు గుట్టు తేడాల్సిందేనని ఆయన అన్నారు విద్యుత్ కొనుగోళ్లలో డబ్బులు చేతులు మారాయని గతంలో కాంగ్రెస్ ఆరోపించిందని , ఈ విషయంలో సమగ్రంగా విచారణ జరిపించాలని కోరారు.గతంలో ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి,  ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డిలను కూడా కమిషన్ విచారణ చేయాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు.

తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని ప్రభాకర్ రావు విమర్శించారు.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు