కేసీఆర్ జగన్ కు పెద్ద ఇబ్బందే వచ్చిందే !

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం లు ఇద్దరూ ఒకరితో ఒకరు సఖ్యతగా ఉంటూ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలను సామరస్యంగా పరిష్కరించుకుంటారనే విషయం అందరికి తెలిసిందే.

ఏపీలో వైసీపీ మొదటిసారి అధికారంలోకి రాగా, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణాలో రెండోసారి అధికారంలోకి వచ్చింది.

ఇలా అధికారంలోకి వచ్చేందుకు భారీ హామీలనే ఇచ్చాయి.వాటిని సక్రమంగా చెప్పిన సమయంలోగా అమలుచేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది.

అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసినా ఆర్ధిక మాంద్యం పెరిగిపోయింది.ఒకరకంగా చెప్పాలంటే ప్రజలకే కాదు, ప్రభుత్వాలకూ ఇది బాగా కష్టకాలమే అని చెప్పుకోవాలి.

ఒక వైపు చూస్తే ప్రభుత్వాలకు ఆదాయం పడిపోతోంది.దీంతో అంచనాలు తలకిందులవుతున్నాయి.

Advertisement

మరోవైపు చూస్తే చేయాల్సిన పనులు కొండంతగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి.దీని కారణంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఇదే విషయంపై ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తూ ఆర్థిక పరిస్థితిపై ఆరాతీయడంతో పాటు మాంద్యం ఎఫెక్ట్ పడకుండా రాష్ట్రంలో ఏ విధంగా ఆదాయం పెంచుకోవాలనే విషయంపై వారిని తగిన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.అయితే ఆదాయం పెంచుకోవడానికి అదనపు ఆర్థిక వనరులు మాత్రం ఇరువురు ముఖ్యమంత్రులకు కనిపించడంలేదు.కేంద్ర ప్రభుత్వం పరిస్థితి కూడా దాదాపు ఇదే రేంజ్ లో ఉంది.

అందుకే రిజర్వ్ బ్యాంకు నుంచి భారీగానే నిధులను తీసుకుంటున్నప్పటికీ గట్టెక్కే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.ఇక ఏపీ విషయానికి వస్తే ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వానికి ఇది చాలా ఇబ్బందికర పరిణామంగానే కనిపిస్తోంది.

రికార్డు స్థాయిలో అసెంబ్లీలో ఎదురే లేకుండా చేసుకున్న వైసీపీకి ఇప్పట్లో తిరుగులేదని అనుకున్నారు.కాకపోతే ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలు, సలహాదారుల వైఫల్యాలతో ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చేలా వారే చేజేతులా చేస్తున్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

ఫలితంగా రాజకీయ పరమైన అంశాల మీదే మొత్తం దృష్టంతా పెట్టాల్సి వస్తోంది.దేశీయంగా నెలకొన్న మాంద్యం పరిస్థితుల వల్ల సహజంగానే రాష్ట్రంలోనూ కొన్ని లక్షల మంది ఉపాధికి గండి పడింది.

Advertisement

దీనికి రాష్ట్రప్రభుత్వ తప్పిదాలు కూడా ఒక కారణమే.ఇసుక విధానంపై తడబడి ఆలస్యం చేయడంతో నిర్మాణ రంగంలో పనులు నిలిచిపోయాయి.

కార్మికులు వేల సంఖ్యలోనే రోడ్డునపడ్డారు.రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోవడమూ వైసీపీకి ఇబ్బందికరంగా తయారయ్యింది.

ఏపీతో పోల్చుకుంటే తెలంగాణ ఆర్థికంగా సంపన్న రాష్ట్రం.అంతేకాదు, ఆదాయం కూడా ఎక్కువే.

అయితే ఏటా కనిపించే వృద్ధి రేటు మాత్రం ఇప్పుడు కనిపించడంలేదు బాగా తగ్గిపోయింది.ఇదే విషయం కేసీఆర్ ను కలవరానికి గురిచేస్తోంది.

తాజా వార్తలు