బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేసీఆర్ వ్యూహాలు

తెలంగాణ రాజకీయం రోజురోజుకు పెద్ద ఎత్తున సరికొత్త మలుపులతో ఆసక్తిగా మారుతున్న పరిస్థితి ఉంది.బీజేపీ టార్గెట్ గా కేసీఆర్ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో మొదటి నుండి రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే ఇటు యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కావచ్చు, ఇటు గిరిజన రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీని టార్గెట్ చేస్తూ ఏకంగా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే.

అయితే బీజేపీని ఇక ఢీ అంటే ఢీ అన్న రీతిలో రాజకీయ కార్యాచరణ ఉండే అవకాశం ఉంది.అందులో భాగంగానే నేడు పెట్రోల్, గీస్ ధరలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

  దీంతో ఇక రానున్న రోజుల్లో పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణ రాజకీయ వాతావరణం ఉండే అవకాశం ఉంది.అయితే రాష్ట్ర బీజేపీ మాత్రం అంతగా కెసీఆర్ కు కౌంటర్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది.

Advertisement

అయితే ఏవైతే అంశాలు బీజేపీ చేతిలో ఉండి, వాటిని ఇంకా అమలు చేయని కీలక అంశాలను ప్రస్తావిస్తూ రాజకీయంగా బీజేపీని ఇబ్బందిపెట్టే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.అయితే కెసీఆర్ కదలికలపై బీజేపీ ఇంకా స్పందించకున్నా తెలంగాణలో అమిత్ షా పర్యటన తరువాత ఇక బీజేపీ కార్యాచరణ కూడా పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది.

ఎందుకంటే ఇప్పటికే మూడు రాష్ట్రాలలో విజయ ఢంకా మోగించిన బీజేపీ ఇక తెలంగాణలోనూ పాగా వేయాలని పెద్ద ఎత్తున ఉవ్విళ్లూరుతున్న విషయం తెలిసిందే.అయితే ఎంత మేరకు కెసీఆర్ ను ఓడించి బీజేపీ అధికారంలోకి వస్తుందనేది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేక పోయినా ఎన్నికల సమయంలో బీజేపీ అనుసరించే కార్యాచరణను బట్టి మనకు కాస్త క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు