CM Revanth Reddy KCR : సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

బీఆర్ఎస్ పార్టీని, తనను సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని తెలిపారు.

అయితే తనను కానీ, తన పార్టీని కానీ టచ్ చేయడం కాంగ్రెస్( Congress ) వల్ల కాదని స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే మీ కంటే హేమాహేమీలనే ఎదుర్కొన్న చరిత్ర తమదని పేర్కొన్నారు.

తెలంగాణను పదేళ్లు పదిలంగా కాపాడుకున్నామన్న కేసీఆర్ కాపాడుకున్న తెలంగాణను పరాయివాళ్ల పాలు చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ఉడుత బెదిరింపులకు భయపడే వాడ్ని కాదని చెప్పారు.తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో తనకు బాగా తెలుసని తెలిపారు.గతంలో కేంద్రం ఒత్తిడి తెచ్చినా తెలంగాణ ప్రాజెక్టులను( Telangana Projects ) అప్పగించలేదన్నారు.

Advertisement

ఆ సమయంలో ప్రాజెక్టులు అప్పగించకపోతే నోటిఫై చేస్తామని బెదిరించారన్నారు.కావాలంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకోమన్నా.

కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని ఆనాడే చెప్పానని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు