గవర్నర్ కు రాజీనామా లేఖను పంపిన కేసీఆర్..!

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు.

ఈ మేరకు రాజీనామా పత్రాన్ని తన వ్యక్తిగత సిబ్బందితో రాజ్ భవన్ కు పంపారని తెలుస్తోంది.

అనంతరం ప్రగతిభవన్ నుంచి సొంత వాహనంలో కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారని సమాచారం.అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో కేసీఆర్ రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది.

మరోవైపు విజయం సాధించిన కాంగ్రెస్ రేపు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది.అయితే దీనిపై రాజ్ భవన్ వర్గాల నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు