మోదీ ర్యాంకింగ్లో కేసీఆరే ఫ‌స్ట్‌?

ఆయా రాష్ట్రాల‌ముఖ్యమంత్రుల పనితీరు, సంక్షేమ పథకాలతో పాటు… కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపించుకుంటున్న ప్రధాని మోడీ ముఖ్య మంత్రులకు ర్యాంక్‌లు కేటాయిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఇందుకు అందుకనుగుణంగా ప్రతి మూడు నెలలకోసారి సర్వే జరిపించేందుకు ప్ర‌త్యేక అధికారుల‌ను కూడా నియ‌మించుకున్నార‌ని తెలుస్తోంది.

కాగా ప్రజాసంక్షేమమే పరమావధిగా ప‌నిచేస్తున్న‌ ముఖ్య మంత్రుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ఇటీవ‌ల జ‌రిపిన స‌ర్వేలో మొదటి స్థానం లభించింద‌ని విన‌వ‌స్తోంది.ఈ నెల 16న ముఖ్యమంత్రులతో జరిపే సమావేశంలో ఈ ర్యాంక్‌లు ప్రకటించనున్నట్టు సమాచారం.

కాగా ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఐదో స్థానం దక్కినట్టు సమాచారం.తనకు ఐదో స్థానం ద‌క్క‌డంతో ఏపీ సీఎం స‌న్నిహితుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

తాజా ర్యాంకింగ్‌లో కేసీఆర్‌ తరువాత వరుసగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌, గుజరాత్‌ సీఎం ఆనందీ బెన్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తదితరులు ఉన్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు