కేసీఆర్ కామెంట్ : అవి వెకిలి మకిలి పిచ్చి సర్వేలు !

లగడపాటి రాజగోపాల్ తాజాగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం పై ఇచ్చిన లీకులపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు.

తెలంగాణాలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.

ప్రస్తుతం పోటీలో ఉన్నవారిలో దాదాపు ఎనిమిది నుంచి పదిమంది వరకు గెలిచే అవకాశం ఉందని లగడపాటి తన సర్వే ఫలితాలను కొంతమేర ప్రకటించాడు.అంతే కాదు.

నారాయణ్‌పేట్‌, భోథ్‌లో ఇండిపెండెంట్లు గెలుస్తారని వాళ్ల పేర్లను కూడా ప్రకటించడం చర్చనీయాశంగా మారింది.

భూపాలపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.లగడపాటి సర్వే ఓ వెకిలి సర్వే అంటూ మండిపడ్డారు.ఉద్యమ సమయంలో శాపాలు పెట్టినవాళ్లు సర్వేలు అంటూ లీకులు చేస్తున్నారని.

Advertisement

అది అంతా ట్రాష్ అంటూ కొట్టిపారేసిన గులాబిదళపతి.ఆ సన్నాసులు కొన్ని వెకిలి మకిలి పిచ్చి సర్వేలు అంటూ ఏవో లీక్ లు ఇస్తున్నారని.

వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు.

Advertisement