జగన్ దూకుడు వెనుక కేసీఆర్ ? ఇద్దరి టార్గెట్ అదేనా ?

రాష్ట్రాలు వేరు, రాజకీయ విధానాలు వేరు.అయినా ఇద్దరి లక్ష్యం ఒక్కటే.

ఆ లక్ష్యాన్ని ఒకరు ఇప్పటికే చేరుకోగా, మరొకరు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

వారే తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్.

ఈ ఇద్దరి ఉమ్మడి రాజకీయ శత్రువు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.తెలంగాణలో టిడిపి ఉనికి కోల్పోయేలా చేయడంతో పాటు చంద్రబాబు ప్రభావం ఏమాత్రం తెలంగాణ లేకుండా కేసీఆర్ ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లి సక్సెస్ అయిన తీరు జగన్ ను బాగా ఆకర్షించింది.

అందుకే కేసీఆర్ బాటలో జగన్ కూడా వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు.దీనికి మొదటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ సలహాలు ఇస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
Kcr Behind Ys Jagan Decisions-జగన్ దూకుడు వెనుక �

టిడిపి అధినేత చంద్రబాబు ని టార్గెట్ గా చేసుకుని జగన్ వెళ్తున్న తీరు, జగన్ తీసుకుంటున్న, తీసుకోబోతున్న అన్ని నిర్ణయాలను కేసీఆర్ కు ముందుగానే చెబుతున్నారు.దాని ప్రకారం ఏ విధంగా ముందుకు వెళ్లాలో కేసీఆర్ జగన్ కు సూచిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ని బయటకు తీస్తాము అంటూ మంత్రులు, పార్టీ నాయకులతో అదేపనిగా ప్రకటనలు చేయిస్తున్నారు.ఆ మేరకు ముందుకు వెళ్తున్నారు.

గత ప్రభుత్వంలో తీసుకున్న అన్ని నిర్ణయాలపైన సిట్ ఏర్పాటు చేసి జగన్ సంచలనం సృష్టించారు.

Kcr Behind Ys Jagan Decisions

పది మంది సభ్యులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు.ఆకస్మాత్తుగా ఈ సిట్ ఏర్పాటు చేయడం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.చంద్రబాబు ను ఎలా ఇరుకున పెట్టాలి అనే విషయంలో జగన్ కు కేసీఆర్ సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ కు చంద్రబాబుపై పీకల్లోతు వరకు ఉన్న కోపాన్ని ఇప్పుడు జగన్ ద్వారా తీర్చుకుంటున్నట్టు తెలుస్తోంది.ముందు ముందు ఇంతకన్నా ఎక్కువ రేంజ్ లో చంద్రబాబు మీద రివెంజ్ తీర్చుకునేలా జగన్ కేసీఆర్ ఇద్దరూ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు