నేను మనిషిని కాదు కుక్కను... ఇతడిది అత్యంత వింతైన పరిస్థితి

కుక్కలకు చాలా విశ్వాసం ఉంటుందని అంటారు, ఇంత తిండి పెడితే మనుషుల కంటే విశ్వాసంగా ఉంటాయని, కొన్ని సార్లు మనుషుల కంటే కుక్కలు నయంగా అనుకుంటూ ఉంటారు.

అలాంటి నేపథ్యంలో కుక్కలకు మనుషులకు మద్య చాలా సన్నిహిత్యం ఏర్పడింది.

ఈ ప్రపంచంలో అత్యధికుల పెట్‌ లు కుక్కలే అంటూ ఒక సర్వేలో వెళ్లడయ్యింది.ఎక్కువ శాతం కుక్కలను పెంచుకుంటారు, ఆ తర్వాత స్థానం పిల్లులకు ఉంటుంది.

కుక్కలు స్టేటస్‌గా కూడా కొందరు భావిస్తారు.అయితే ఈ వ్యక్తి మాత్రం కుక్కలా మారడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది.

చిన్నప్పటి నుండి కుక్క లక్షణాలను ఉన్న కాజ్‌ జేమ్స్‌ ప్రపంచంలోనే అత్యంత అరుదైన సమస్యతో బాధపడుతున్నాడు.తనకు తాను ఒక కుక్కను అని ఫీల్‌ అవుతూ ఉంటాడు.కొన్ని సార్లు కుక్కల మాదిరిగా మొరగడం, ప్రతి సారి కుక్క మాదిరిగా తినడం, తాగడం, కొత్త వారిని నాకుతూ పలకరించడం చేస్తూ ఉంటాడు.

Advertisement

అతడి పద్దతి కొత్త వారికి పిచ్చిలా అనిపిస్తుంది.కాని అతడితో ఉన్న వారికి అతడు మనిషే, మామూలు మనిషే అని ఆ తర్వాత అర్థం అవుతుంది.కుక్క బతుకు చాలా హీనంగా ఉంటుందంటారు.

అయితే ఇతడు మాత్రం చాలా రిచ్‌గా జీవిస్తున్నాడు.ఇంగ్లాండ్‌లోని గ్రేటర్‌ మంచెస్టర్‌ లో నివసిస్తున్న ఈ 37 ఏళ్ల జేమ్స్‌ చిన్నప్పటి నుండి కుక్కలా ప్రవర్తిస్తూనే ఉన్నాడు.

జేమ్స్‌కు ఆరు సంవత్సరాలు ఉన్న సమయంలో కుక్కలా నాకడం, కుక్కలా మొరగడం చేసేవాడట.దాంతో అతడి తల్లిదండ్రులు సరదాగా తీసుకున్నారు.

ఆ తర్వాత కూడా అదే కొనసాగుతూ వచ్చింది.జేమ్స్‌కు 17 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఈ వ్యవహారం మరింతగా ముదిరింది.

కఠినమైన చర్మాన్ని సూపర్ స్మూత్ గా మార్చే సింపుల్ టిప్ మీకోసం!

తాను మనిషిని కాదని, కుక్కను అని, తాను మొరిగితే కుక్కలకు అర్థం అవుతుందని, కుక్కలు చేసే శబ్దాలు నాకు అర్థం అవుతున్నాయని చెబుతున్నాడు.

Advertisement

లక్షల రూపాయలు ఖర్చు చేసి కుక్కల ఉండేందుకు లెదర్‌ సూట్‌ను తయారు చేయించుకున్నాడు.కుక్కలా కనిపించేందుకు ఒక తలను కూడా తయారు చేయించుకున్నాడు.మొత్తానికి ఇతడు 60 శాతం కుక్క మదిరిగా మారిపోయాడు.

అయితే ఇతర పద్దతులు మాత్రం మనుషుల మాదిరిగానే ఉంటున్నాయి.ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి అవ్వడం ఈయన్ను పెళ్లి చేసుకునేందుకు ఎవరు ముందుకు రావడం లేదు.

జేమ్స్‌ కూడా పెళ్లిపై ఆసక్తి లేదు అంటున్నాడు.మొత్తానికి ఈయన ప్రపంచంలోనే అరుదైన వ్యక్తిగా పేరు దక్కించుకున్నాడు.

తాజా వార్తలు