మరోసారి ఈడీ విచారణకు కవిత..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు.

ఈ క్రమంలో కవితకు మద్ధతు తెలిపేందుకు ఇప్పటికే పలువురు మంత్రులు, కీలక నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.

మరోవైపు న్యాయ నిపుణులతో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు చర్చలు జరిపారు.అదేవిధంగా లీగల్ టీమ్ తో కవిత కూడా సమావేశం అయ్యారు.

కవితకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ సూచనలు చేస్తున్నారని తెలుస్తోంది.అదేవిధంగా ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.

అటు ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Advertisement
కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?

తాజా వార్తలు