ఆ హీరోతో ఇకపై అస్సలు నటించను .. పెద్ద శాడిస్టు అంటున్న హీరోయిన్

బాలివుడ్ భామ కత్రీనా కైఫ్ ఫుల్ ఫార్మ్ లో ఉంది.

అసల ఒక్క ఖాన్ తో సినిమా చేస్తేనే కెరీర్ లో కి అది చాలు అనుకుంటారు చాలామంది హీరోయిన్లు.

అలాంటిది ముగ్గురు ఖాన్లతో అల్రెడి రొమాన్స్ చేసిన కత్రీనా, మరోసారి ఆమీర్, సల్మాన్, షారుఖ్ లతో ఓ రౌండ్ వేయనుంది.అంటే అర్థం కాలేదా? కత్రీనా తదుపరి మూడు సినిమాలు వరుసగా ముగ్గురు ఖాన్లతోనే ఉన్నాయి.ఆమీర్ తో చేస్తున్న థగ్స్ ఆఫ్ హిందోస్తాన్ వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా విడుదల అవుతుంది.

ఇది బాలివుడ్ చరిత్రలోనే అత్యంత భారీ చిత్రం.ఇక సల్మాన్ తో చేస్తున్న టైగర్ జిందా హై ఇదే ఏడాది క్రిస్ట్మస్ కి రానుండగా, షారుఖ్ సినిమా వచ్చే ఏడాది చివర్లో ఉంటుంది.

ఇలా ముగ్గురు ఖాన్లతో జోడికడుతున్న ధైర్యం ఏమో, మాజి బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ మీద సంచలబ వ్యాఖ్యలు చేసింది.రణబీర్ - కత్రీనా రెండుమూడేళ్ళ పాటు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

పెళ్ళి చేసుకోవడం ఖాయం అనుకున్న సమయంలో బ్రేకప్ జరిగింది.ఇందుకు కారణం ఎవరో తెలియదు కాని కత్రీనా మాత్రం బాగా నొచ్చుకుంది.

అప్పటికే ఒప్పుకున్న జగ్గా జాసూస్ అనే సినిమా అతికష్టం మీద పూర్తిచేసిన కత్రీనా, అందులో రణబీర్ తో కిస్సింగ్ సీన్స్ చేయడానికి కూడా ఇష్టపడలేదు.మొత్తానికి ఆ సినిమా జులైలో విడుదల కానుంది.

ఇదే వీరిద్దరి కాంబినేషన్లో చివరి సినిమా అవుతుందేమో.ఎందుకంటే ఇక రణబీర్ తో నటించేది లేదు అని స్టేట్మెంట్ ఇచ్చింది ఈ సుందరి.

రణబీర్ ప్రవర్తన చాలా వింతగా ఉంటుందని, సహనాన్ని పరీక్షిస్తాడని, పెద్ద శాడిస్టులా ఉంటాడని, అతనితో ఇంకో సినిమా అస్సలు చేయనని నొక్కి నొక్కి చెప్పింది కత్రీనా.

Advertisement

తాజా వార్తలు