ప్రభాస్ తో సినిమా అంటే అది ఉండాల్సిందే.. యంగ్ హీరో కార్తికేయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ(Karthikeya ) ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల బెదురులంక అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన త్వరలోనే భజే వాయువేగం(Bhaje vaayu vegam) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు.

క్రైమ్ త్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా మే 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయనకు ప్రభాస్ (Prabhas)తో సినిమా చేయడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ప్రభాస్ సినిమా చేసే అవకాశం వస్తే ఎలాంటి పాత్రలో నటిస్తారు.ఒకవేళ ఆయనతో నటించే అవకాశం వస్తే విలన్ గా అయిన చేస్తారా అనే ప్రశ్న ఎదురైంది.

ఈ ప్రశ్నకు కార్తికేయ సమాధానం చెబుతూ అది పూర్తిగా స్క్రిప్ట్ పై ఆధారపడి ఉంటుందని తెలిపారు.నెగటివ్‌ రోల్‌ అయితే ఆయనతో ఆ స్థాయిలో యాక్షన్‌ సీన్లు ఉండాలని కోరుకుంటాను.

Advertisement

అలాంటి యాక్షన్‌ సన్నివేశాలు ఉంటే విలన్‌గా చేసేందుకు సిద్ధమే అని తెలిపారు.అయితే సాధ్యమా అనేది ఆలోచించాలని తెలిపారు.

మొత్తానికి సరైన యాక్షన్ సన్నివేశాలు కనుక ఉంటే ప్రభాస్ తో విలన్ పాత్రలో నటించడానికి కూడా కార్తికేయ సిద్ధమయ్యారని ఈ సందర్భంగా వెల్లడించారు.అయితే ఈయన హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే.నాని (Nani )హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్, అజిత్ హీరోగా నటించిన వాలిమై(valimai) అనే సినిమాలో కూడా ఈయన విలన్ గా నటించారు అయితే ఈ రెండు సినిమాలు కూడా తనకు ప్లస్ అయ్యాయని కార్తికేయ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు