టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు.
ఈయన వరుస సినిమాలు చేస్తూ మినిమమ్ గ్యారెంటీ హిట్స్ కొడుతూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచు కున్నారు.
ఇటీవలే నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.కార్తికేయ సినిమా నిఖిల్ కెరీర్ లో ఎంత హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
ఇప్పుడు ఆ సక్సెస్ ఫుల్ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 చేసాడు.చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కార్తికేయ కంటే కూడా మరింత హిట్ అవ్వడమే కాకుండా వసూళ్ళలో కూడా సంచలనం సృష్టింస్తుంది.
చిన్న సినిమాగా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయినా ఈ సినిమాకు ఆ తర్వాత భారీ క్రేజ్ ఏర్పడింది.అసలు ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడతారని ఎవ్వరూ అనుకోలేదు.
శ్రీకృష్ణుడి కథాంశంతో తెరకెక్కడంతో అక్కడి ప్రేక్షకులను మనకంటే బాగా మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా అన్ని చోట్లా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది.
ఆగష్టు 13న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ టచ్ చేయగా ఇప్పుడు మేకర్స్ ఈ ఆనందాన్ని అందరితో పంచుకో బోతున్నారు.ఈ సినిమా 100 కోట్ల మార్క్ చేరుకోవడంతో ఆగష్టు 26న సాయంత్రం 5 గంటలకు 100 కోట్ల సెలెబ్రేషన్స్ వేడుకను గ్రాండ్ గా కర్నూల్ లో నిర్వహించ నున్నట్టు మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.మరి చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది అంటే అందరు ఆశ్చర్య పోతున్నారు.
ఈ సినిమా స్పీడ్ చూస్తుంటే మరిన్ని కలెక్షన్స్ సాధించే అవకాశం కనిపిస్తుంది.ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy