కార్తీక మాసంలో ఈ క్షేత్రాలను దర్శించుకున్నారా.. భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యమంటూ?

ఏడాదిలో ప్రతి నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.

కార్తీక మాసంలో( Karthika Masam ) కార్తీక సోమవారాలు మరింత ప్రత్యేకం కాగా కార్తీక మాసంలో నవనంది క్షేత్రాలను దర్శించుకుంటే శుభ ఫలితాలను పొందవచ్చు.

నంద్యాల జిల్లాలోని మహానందితో పాటు మహానంది( Mahanandi ) చుట్టూ 16 కిలోమీటర్ల పరిధిలో ఈ నవనంది క్షేత్రాలు వెలిశాయి.ఈ ఆలయాలను దర్శించుకుంటే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యమంటూ పండితులు చెబుతున్నారు.

సోమవారం రోజున లేదా కార్తీక పౌర్ణమి రోజున గుడిపాడ గడ్డలో ఉన్న భ్రమరాంబ దేవిని,( Bhramarambha Devi ) మల్లిఖార్జున స్వామి ఆలయంలో ఉన్న సాక్షిగణపతిని,( Sakshi Ganapathi ) దర్శించుకుని యాత్ర ప్రారంభిస్తే మంచిది.ప్రథమ నంది, నాగనంది, సోమనంది, శివనంది, కృష్ణనంది, మహానంది, వినాయక నంది, గరుడ నంది, సూర్య నంది క్షేత్రాలను దర్శించుకుని చివరగా గుడిపాడిగడ్డలో ఉన్న మల్లిఖార్జునస్వామిని దర్శించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి.

ప్రథమ నంది శామకాల్వ గట్టున ఉండగా మహానంది క్షేత్రంలో శివుడు గోవుపాద రూపంలో వెలిశారు.మహానంది ఆలయాల్లో అంతర్భాగంగా వినయక నంది( Vinayaka Nandi ) నిర్మితమైంది.మహానంది క్షేత్రంలో ఆలయానికి పడమటి దిశలో గరుడ నంది ఉంది.

Advertisement

మహానంది నంద్యాల ప్రధాన రహదారిలో తమడపల్లెకు దక్షిణం వైపున సూర్యనంది( Surya Nandi ) ఉంది.బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వలో శివనంది ఉంది.

నల్లమల అడవిలో కృష్ణనంది క్షేత్రం ఉండగా ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.నంద్యాలలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ప్రాణంగణంలో నాగనంది ఉంది.ఈ ఆలయాలను జీవితంలో ఒక్కసారి దర్శించుకున్నా శుభ ఫలితాలను పొందే ఛాన్స్ ఉంటుంది.

కార్తీకమాసంలో పూజలు చేసేవాళ్లు నియమనిష్టలను పాటిస్తూ పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.ఈ గుడులకు వెళ్లడం సాధ్యం కాకపోతే దగ్గర్లోని శివాలయంలో పూజలు చేస్తే మంచిదని చెప్పవచ్చు.

Taxation Of Winnings — How Canadian Players Should Treat Casino And Blackjack Payouts At C Bet
Advertisement

తాజా వార్తలు