కార్తీ సత్యం సుందరం మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలివే.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందా?

కార్తీ అరవిందస్వామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సత్యం సుందరం( Sathyam Sundaram ) మూవీకి అన్ని ప్రముఖ వెబ్ సైట్లు 3 అంతకంటే ఎక్కువ రేటింగ్ ఇచ్చాయి.96 సినిమాకు దర్శకత్వం వహించి ప్రశంసలు పొందిన ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో సత్యం సుందరం మూవీ తెరకెక్కింది.

ఆయితే దేవర సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సైతం సొంతం చేసుకుందని ప్రచారం జరుగుతోంది.

నెట్ ఫ్లిక్స్( Netflix ) ఈ మధ్య కాలంలో క్రేజీ సినిమాల డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.నెట్ ఫ్లిక్స్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే.ఈ ఓటీటీ రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

సత్యం సుందరం సినిమా మనస్సులను కదిలించే సినిమా అనే సంగతి తెలిసిందే.

దేవర సినిమా( Devara movie )కు పోటీగా రిలీజ్ కావడం వల్ల సత్యం సుందరం సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మరీ భారీ స్థాయిలో థియేటర్లు అయితే దక్కలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే రాబోయే రోజుల్లో ఈ సినిమాకు థియేటర్ల సంఖ్య కచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.దేవర సినిమా మాస్ సినిమా కావడం సత్యం సుందరం క్లాస్ సినిమా కావడంతో ఈ రెండు సినిమాలను పోల్చలేము.

Advertisement

దేవర మూవీ విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా సత్యం సుందరం ఎన్ని వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి.క్రేజీ సినిమాల డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడం వల్ల నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి సబ్ స్క్రైబర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

సత్యం సుందరం సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని ఫుల్ రన్ లో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు