ప్రేయసి ఖర్చుల కోసం దొంగలా మారాడు

ఈరోజుల్లో ప్రేమ కేలవం మనసుతోనే కాదు, డబ్బుతో కూడా ముడిపడిపోయింది.కేవలం మనసిస్తే సరిపోదు కదా.

ప్రేమించిన అమ్మాయికి పెద్ద పెద్ద గిఫ్టులు ఇవ్వాలి, సినిమాలు చూపించాలి, కాస్ట్లీ రెస్టారెంట్‌లలో భోజనం చేయించాలి, షాపింగులు, పబ్ లు .అబ్బో గర్ల్ ఫ్రెండ్ ని మేయింటేన్ చేయడం కంటే పెళ్ళి చేసుకోని సంసారం చేయడం ఖర్చు తక్కువ పని.తన గర్ల్ ఫ్రెండ్ అడిగిందల్లా ఇవ్వడం కోసం దొంగలాగా మారిపోయాడు ఓ కర్ణాటక కుర్రాడు.కర్ణాటక హుబ్బలికి చెందిన వీరేష్ (27) కి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది.

ప్రేయసి ఖర్చుల కోసం, తనకు విలాసవంతమైన జీవితం అందించడం కోసం దొంగతనాలు మొదలుపెట్టాడు.ఈ దొంగతనాలు చేయడం ఎలా నేర్చుకున్నాడు అనుకుంటున్నారు .యూట్యూబ్ చూసి.అవును, యూట్యూబ్ విడియోల ద్వారా, డైమండ్‌ కటర్ ఉపయోగించి కారు అద్దాలను ఎలా పగలగొడట్టాలో నేర్చుకున్నాడు.

దొరికిన కారు అద్దాలు పగలగొట్టేసి, అందులో ఉన్న విలువైన వస్తువులన్ని కాజేయటం ఇతని పని.దొంగలించిన ఓ డెబిట్ కార్డ్ ద్వారా మద్యం కొనుగోలు చేసాడు.కార్డు ఓనర్ కి ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి జరిగిందో తెలిసిపోవడంతో వెంటనే పోలీసులకి సమాచారం అందించాడు.స్థానిక బస్టాండ్ దగ్గర తిరుగుతూ పోలిసుల చేతికి చిక్కాడు వీరేష్.15 దొంగతనాల్లో ఇతని హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.అలాగే తన దగ్గర ఉన్న 5 లక్షల నగదు, ఏటిఎమ్ కార్డ్స్, 12 ల్యాప్ టాప్స్, మొబైల్స్ , హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Advertisement
నైట్‌ నిద్రించే ముందు ఇలా చేస్తే.. వేక‌ప్ అద్భుతంగా ఉంటుంది!

తాజా వార్తలు