కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన

కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య సంచలన ప్రకటన చేశారు.రానున్న అసెంబ్లీ ఎన్నికలే తను పోటీ చేసే చివరి ఎన్నికలు అని తెలిపారు.

కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

అయితే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు.మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీ సీనియర్ నేత యడియూరప్ప చేసిన వ్యాఖ్యలను సిద్ధరామయ్య తిప్పికొట్టారు.

యుడియూరప్పకు బీజేపీ అధిష్టానం ఇప్పటికే ఒక పంచ్ ఇచ్చిందని, సీఎం పదవి నుంచి తొలగించిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Advertisement
The Foods That Help To Kill Breast Cancer Details

తాజా వార్తలు