కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అన్ని ఆ పార్టీ వైపే..!!

కర్ణాటక రాష్ట్రంలో( Karnataka assembly election ) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిస్తున్నాయి.మొత్తం 224 అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన ఈ ఎన్నికలలో.

113 సీట్ల మ్యాజిక్ మార్క్ అందుకున్న వారికి అధికారం దక్కబోతోంది.కొన్ని ఎగ్జిట్ పోల్స్( Exit polls ) హాంగ్ అని చూపిస్తుంటే చాలా వరకు కాంగ్రెస్ అధికారంలోకి రానుందని ఫలితాలు చెప్పుకొస్తున్నాయి.

ఇదే సమయంలో జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.ఇదిలా ఉంటే "జీ న్యూస్" ఎగ్జిట్ పోల్ లో కాంగ్రెస్ పార్టీకి 103-118 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది.

అలాగే బీజేపీకి 79-94 స్థానాలు లభించనున్నాయి.జేడీఎస్ కు 25-33 స్థానాలు లభిస్తాయని "జీ న్యూస్" పోల్ పేర్కొంది.

Advertisement

ఇక ఇతరులకు రెండు నుంచి ఐదు స్థానాలు వస్తాయని తేలింది.గత మార్చి నెలలో ఒపీనియన్ పోల్స్ లో "జీ న్యూస్" ప్రకటించిన ఫలితాలకి ప్రజెంట్ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

ఇక ఇదే సమయంలో జాతీయ న్యూస్ నెట్ వర్క్ టీవీ9 భారత్ వర్ష్ పోల్ స్త్రాట్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటించింది.కాంగ్రెస్ పార్టీకి ఈసారి 99-109 స్థానాలు లభించే అవకాశం ఉన్నట్లు తేలింది.

అయితే మ్యాజిక్ మార్క్ కు అవసరమైన 113 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలకు తక్కువగా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి.బీజేపీ 88-98 స్థానాలు( BJP ) మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఫలితాలు వెల్లాడించింది.

జేడీఎస్ కి 21-26 సీట్లు లభిస్తాయి అని తేలింది.ఈసారి హోరాహోరీ పోటీ ఉండనుందని టీవీ9 భారత్ వర్ష్- పోల్ స్ట్రాట్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా

మొత్తం మీద చూసుకుంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిస్తున్నాయి.

Advertisement