Karimnagar:బండి సంజయ్ గంగులకు చెక్ పెడతారా..?

ప్రస్తుతం రాజకీయాలు చాలా జోరుగా సాగుతున్నాయి.ఇంకో 24 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్న తరుణంలో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు.

ప్రచారంలో స్పీడ్ పెంచేశారు.ఇదే తరుణంలో కరీంనగర్ ( Karimnagar ) అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా రసవత్తరంగా మారుతుంది.

ఇద్దరు బిగ్ నేతల మధ్య పోటీ నెలకొని ఉంది.ఒకరు బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు బండి సంజయ్, మరొకరు బీఆర్ఎస్ క్యాబినెట్ మంత్రి గంగుల కమలాకర్.

ఇద్దరు రాష్ట్ర స్థాయి లీడర్లే.కరీంనగర్ లో మంచిపట్టున్న నాయకులే.

Advertisement

మరి ఇద్దరిలో ప్రజలు ఎవరి వైపు ఉంటారనేది చాలా సస్పెన్స్ గా మారింది.మరి ఆ వివరాలు చూద్దాం.

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ( Bandi Sanjay ) కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టెన్సీ లో ప్రచారం ముమ్మరం చేశారు.నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఈ సందర్భంగా ప్రజలను మమేకం చేసుకునేందుకు గల్లి,గల్లి తిరుగుతున్నారు.బైక్ ర్యాలీలు, రోడ్ షోలు, సభలు,సమావేశాలు ఇలా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ప్రసంగిస్తూ జనాలను తన వైపు తిప్పుకునేలా అనేక ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు.

ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్నటువంటి గంగుల కమలాకర్ కూడా తగ్గేదేలే అన్నట్టు సభలు, సమావేశాలు అంటూ రకరకాలుగా ప్రజలను మమేకం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

కానీ ఈసారి ఇద్దరు టాప్ లీడర్లు కరీంనగర్ లో పోటీలో ఉన్నారు కనుక ప్రజలు ఎవరికి ఓటేస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది.అయితే కరీంనగర్ లో 2014 ఎన్నికల్లో కూడా బండి సంజయ్ బిజెపి నుంచి పోటీ చేశారు, అలాగే గంగుల కమలాకర్ ( Gangula kamalakar) టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు, ఇక కాంగ్రెస్ నుంచి లక్ష్మీ నరసింహరావు పోటీ చేశారు.ఇందులో గెలుపొందింది గంగుల కమలాకర్.

Advertisement

ఆయనకు 77,000 ఓట్లు పడితే, బండి సంజయ్ కి 52,000 ఓట్లు పడ్డాయి. ఇక నరసింహారావుకు 51 వేల ఓట్లు పడ్డాయి.

ఆ తర్వాత 2018 లో కూడా ఎలక్షన్స్ వచ్చాయి.క్రమంలో కూడా బిజెపి నుంచి బండి సంజయ్ పోటీ చేశారు.

అప్పుడు ఈయనకు 66,000 ఓట్లు పడ్డాయి.అలాగే టిఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ పోటీ చేశారు.దాదాపు 90 వేల ఓట్లు పడ్డాయి.

కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar ) బరిలో ఉన్నారు.ఈయనకు దాదాపు 40 వేల ఓట్లు పడ్డాయి.

ఇలా ప్రతిసారి బిజెపి, కాంగ్రెస్ ,టిఆర్ఎస్ మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది.అయితే 2014, 2018లో బండి సంజయ్ కేవలం బిజెపి కామన్ లీడర్ గా మాత్రమే ఉండేవారు.

కాని ప్రస్తుతం ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన అనుభవం, అలాగే కరీంనగర్ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు.ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే 2023 ఎన్నికల్లో బండి సంజయ్ ఇప్పటికే నామినేషన్ వేశారు.తప్పకుండా ఈసారి విజయదుందుభి మోగిస్తారని గట్టిగా చెబుతున్నారు.

అయితే ఈసారి కరీంనగర్ ( Karimnagar ) లో ఎన్నికలు చాలా రసవత్తరంగా కొనసాగనున్నాయి.ఇద్దరు బలమైన నేతలు కాబట్టి ప్రజలు మళ్లీ గంగులకే పట్టం కడతారా, లేదంటే బండి సంజయ్ వైపు మొగ్గు చూపుతారా అనేది కాస్త ప్రశ్నార్థకంగా మారింది.

ఏది ఏమైనా ఈసారి గంగులకు, బండి సంజయ్ గట్టి పోటీనే ఇవ్వబోతున్నారని రాజకీయ విశ్లేషణ అంటున్నారు.

తాజా వార్తలు