అయ్యో పాపం.. కరణ్ జోహార్ ని కత్రినా కైఫ్ పెళ్లికి పిలవలేదట?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో కాఫీ విత్ కరణ్.

ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే.ఈ షోలో పాల్గొన్న సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎక్కువగా రాబడుతూ ఉంటాడు కరణ్ జోహార్.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ షో కి సంబంధించిన ఫినాలే ఎపిసోడ్లో కరణ్ జోహార్ బాలీవుడ్ క్యూట్ జంట ఆయన కత్రినా కైఫ్,విక్కీ కౌశల్ ల జంట గురించి పలు వ్యాఖ్యలు చేస్తూ ఆ జంట పెళ్ళికి పిలవకపోవడం పై కరణ్ జోహార్ స్పందించారు.పదమూడో ఎపిసోడ్‌లో తన్మయ్ భట్, డానిష్ సైత్, కుషా కపిల, నిహారిక పాల్గొన్నారు.

ఈ నలుగురితో కాఫీ విత్ కరణ్ షో చాలా సందడి సందడిగా సాగింది.ఈ క్రమంలోనే కరణ్ జోహార్ మాట్లాడుతూ.

Advertisement

విక్కీ, కత్రినా లు వివాహానికి పిలవకపోవడం నాకు ఇబ్బందిగా మారింది.ఆహ్వానం అందలేదని ఒప్పుకోవడం నాకు కొంచెం కష్టంగా అనిపించింది.

ఈ విషయంలో చాలామందికి నా పై సానుభూతితో పాటు సందేహాలు వచ్చాయి.మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించలేదని అడిగారు కూడా.

మీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కదా ప్రశ్నించారు.

విక్కీ,కత్రినా లు వారి వివాహానికి అనురాగ్ కశ్యప్‌ను కూడా ఆహ్వానించలేదు అని తెలుసుకున్న తరువాత కాస్త ఉపశమనం లభించింది అని తెలిపారుకరణ్ జోహార్.ఇకపోతే విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ జంట విషయానికి వస్తే ఈ జంట గత ఏడాది డిసెంబర్ 9న మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.రాజస్థాన్లోని ఒక హోటల్లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

కానీ వీరి పెళ్లికి అతి కొద్ది మంది సన్నిహితులు స్నేహితులు సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు.

Advertisement