Kantara OTT : అఫిషియల్‌ : కాంతార ఎదురు చూపులకు తెర, ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్

కన్నడంలో రూపొంది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కాంతార సినిమా దేశ వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రేక్షకులు చూశారు.

నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను రాబట్టింది.

ఒక చిన్న సినిమా కనీసం పాతిక కోట్లు కూడా ఖర్చు కాని సినిమా ఇంత భారీగా వసూళ్లు నమోదు చేయడం అంటే మామూలు విషయం కాదు.ఈ స్థాయి లో వసూళ్లు నమోదు చేసిన కాంతార సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లో వస్తుందా అంటూ కొందరు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు కాంతార సినిమా యొక్క ఓటీటీ స్ట్రీమింగ్‌ పై క్లారిటీ వచ్చింది.ప్రముఖ ఓటీటీ అమెజాన్ వారు ఈ సినిమా ను కొనుగోలు చేయడం జరిగింది.

భారీ మొత్తానికి ఈ సినిమా ను అమెజాన్ ప్రైమ్‌ కొనుగోలు చేయడం వల్ల కాస్త ఎక్కువ ప్రచారం చేసి స్ట్రీమింగ్‌ చేస్తుందని అంతా భావించారు.కానీ సైలెంట్ గా రేపే కాంతార సినిమా స్ట్రీమింగ్‌ అంటూ ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది.

Advertisement

అయినా కూడా అమెజాన్‌ లో ఈ ఏడాదిలో అత్యధిక వ్యూస్ ను రాబట్టుకోబోతున్న సినిమా గా కాంతార సినిమా నిలుస్తుందని ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు ఎలాగూ ఇప్పటికే నమోదు అయ్యాయి.

కనుక రికార్డు స్థాయి లో అమెజాన్‌ లో ఈ సినిమా యొక్క వ్యూస్ రావడం ఖాయం అన్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.ఓటీటీ లో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూసిన వారి యొక్క ఎదురు చూపులకు తెర పడ్డట్లు అయ్యింది.

ఓటీటీ లో ఈనెల 24 న అంటే నేటి అర్థ రాత్రి నుండే కాంతార సినిమా అమెజాన్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆరోగ్యంగా లేమని చెప్పటానికి సూచనలు..
Advertisement

తాజా వార్తలు