ఆ సూపర్‌ హిట్‌ ఓటీటీ కోసం ప్రతి ఒక్కరు వెయిటింగ్‌

ఈమద్య కాలంలో సినిమా థియేటర్లలో విడుదల అవుతున్న సినిమా ల కోసం ఎంతగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారో అంతకు మించి అన్నట్లుగా ఓటీటీ లో విడుదల ఎప్పుడు అంటూ థియేట్రికల్‌ రిలీజ్ అయిన సినిమా ల గురించి ఎదురు చూస్తున్నారు.

భారీ అంచనాల నడుమ రూపొంది థియేటర్‌ లో విడుదల అయిన సినిమా లు ఓటీటీ లో ఎప్పుడు వస్తాయా చూద్దామా అంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఎందుకంటే థియేటర్ కు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లాలి అంటే కనీసం వెయ్యి నుండి పదిహేను వందల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.అందుకే సూపర్ స్టార్‌ సినిమా లను అంత ఖర్చు పెట్టి థియేటర్లలో చూడటం కంటే కూడా ఓటీటీ లో వస్తే ప్రశాంతంగా చూడాలని అభిమానులు సగటు ఫ్యామిలీ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఓటీటీ ల వైపు చూస్తున్నారు.ఇటీవల విడుదల అయిన యూనివర్శిల్‌ స్టార్ కమల్‌ హాసన్‌ విక్రమ్‌ సినిమా మంచి కమర్షియల్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా కు దాదాపుగా రెండు వందల కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి.దాంతో ఓటీటీ లో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది.

Advertisement

స్ట్రీమింగ్‌ ఎప్పుడు చేద్దాం అన్నట్లుగా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు.బాక్సాఫీస్ ను షేక్‌ చేస్తున్న విక్రమ్‌ సినిమా ను ఎప్పటి వరకు ఓటీటీ లో విడుదల చేసేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

ఈమద్య కాలంలో దాదాపు అన్ని సినిమా లు కూడా నాలుగు వారాల్లో స్ట్రీమింగ్‌ చేస్తున్న విషయం తెల్సిందే.కనుక విక్రమ్‌ సినిమా కూడా నాలుగు వారాల్లో ప్రముఖ ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఆ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి ఎలాంటి క్లారిటీ అయితే లేదు.కమల్‌ ఈ సినిమా ను సొంతంగా నిర్మించాడు.

కనుక ఆయన ఎప్పటికి ఈ సినిమా స్ట్రీమింగ్ చేసేది ఆయనే చెప్పాలి.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...
Advertisement