ఆవిషయంలో బహిరంగంగా క్షమాపణలు చెప్పిన కమల్ హాసన్?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న నటుడు కమల్ హాసన్ సొంత బ్యానర్ లో తెరకెక్కిన విక్రమ్ సినిమా జూన్ మూడవ తేదీ విడుదల కానుంది.

ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత కమల్ హాసన్ నటించిన సినిమా విడుదల కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో విడుదలకానుంది.

లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి, ఫాహద్ పజిల్ కీలక పాత్రలో నటించగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో నటిస్తున్నారు.ఇలా ఈ సినిమాలో స్టార్ హీరోలందరూ నటించడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ హాసన్ బహిరంగంగా తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు.అయితే కమల్ హాసన్ ఎందుకు క్షమాపణలు చెప్పారు అనే విషయానికి వస్తే.

Kamal Haasan Has Publicly Apologized For That Incident, Kamal Haasan, Tollyhwood
Advertisement
Kamal Haasan Has Publicly Apologized For That Incident, Kamal Haasan, Tollyhwood

తాను నటించిన సినిమా విడుదల అయి 4 సంవత్సరాలు అయింది.ఇన్ని సంవత్సరాలుగా సినిమాలు చేయకపోవడంతో కమల్ హాసన్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు.ఇంకా సినిమా ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం తిరిగి తాను ఇండస్ట్రీలోనే పెడుతున్నానని, ప్రజలకు కూడా పెట్టుబడి పెడతానని తెలిపారు.

జూన్ 3వ తేదీ ఈ సినిమా విడుదల కావడమే కాకుండా తన అభిమాన నాయకుడు కరుణానిధి జయంతి కూడా అదే రోజు కావడం విశేషమని తెలిపారు.ఇక ఈ సందర్భంగా ఏకంగా ఆరు వందల సినిమాలకు పీఆర్ఓగా వర్క్ చేసిన డైమాండ్ బాబును ఆయన సత్కరించారు. ఇక జూన్ 3న విడుదల కానున్న ఈ సినిమాను సెన్సార్ బోర్డు సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు.173 నిమిషాల రన్ టైం ఉన్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు