దక్షిణాది సిని ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు కమల్ హాసన్ (Kamal Hassan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఇండస్ట్రీలో నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా కొనసాగుతున్నారు.
ఇలా ఇండస్ట్రీలో దర్శక నిర్మాతగా నటుడిగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే.2008లో రాజకీయాలలోకి వచ్చిన కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించి ఎన్నికలలో పోటీ చేశారు అయితే ఈయన అభ్యర్థులు గెలవకపోయినా మెజార్టీ ఓట్లను సంపాదించుకున్నారు.
ఇలా ఒకవైపు రాజకీయాలలో కొనసాగుతూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా మారిపోయారు.తాజాగా విక్రమ్(Vikram) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి కమల్ హాసన్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.ప్రస్తుతం ఈయన శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 (Indaian 2) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఇలా ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నటువంటి కమల్ హాసన్ ఖద్దర్ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తుంది.కమల్ హాసన్ ఎప్పటినుంచో ఖద్దర్ వస్త్రాలకు చేనేత కార్మికులకు మద్దతుగా నిలబడుతూ వచ్చారు.
ఇకపోతే హౌస్ ఆఫ్ ఖద్దర్( House of Khaddar ) అనే వ్యాపార సంస్థను కూడా ప్రారంభించారు.అయితే ఈ వ్యాపారాన్ని మరింత విస్తరింప చేయడం కోసం ఈయన ఖద్దర్ వస్త్రాల నిపుణులతో కలిసి ఈయన మంగళవారం ఇటలీకి వెళ్లినట్లు పార్టీ నాయకులు తెలియజేస్తున్నారు.ఇలా ఖద్దర్ వస్త్రాలకు చేనేత కార్మికులకు మద్దతుగా నిలిచినటువంటి ఈయన ప్రస్తుతం అదే వ్యాపార రంగంలోకి దిగి ఈ వ్యాపారాన్ని మరింత విస్తరింప చేయాలనుకుంటున్నారు.
మరి ఇండస్ట్రీలో నటుడిగా సక్సెస్ అయినటువంటి ఈయన వ్యాపార రంగంలో కూడా సక్సెస్ కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy