ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో క్వాలిటీ తక్కువంటూ కామెంట్స్.. కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్( Nandamuri Kalyan Ram ) ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తన సొంత నిర్మాణంలో కొన్ని సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

అలా హీరోగా నిర్మాతగా బాగా రాణిస్తున్నారు కళ్యాణ్ రామ్.

దేవర సినిమాతో పాటు పలు హిట్ సినిమాలు కూడా వచ్చాయి.ఈ నిర్మాణ సంస్థలో కొన్ని ఫ్లాపులు వచ్చినప్పటికీ ప్రస్తుతం సక్సెస్ఫుల్ ప్రోడక్షన్ హౌస్గా కొనసాగుతోంది.

అయితే ఎన్టీఆర్( NTR ) ఈ బ్యానర్ లోనే జై లవకుశ, దేవర ( Jai Lava Kusa, Devara )లాంటి పెద్ద సినిమాలు చేశాడు.కాగా మామూలుగా హీరోల సొంత నిర్మాణ సంస్థలంటే ప్రొడక్షన్ విషయంలో రాజీ లేకుండా ఉంటాయనే అభిప్రాయం ఉంటుంది.

Kalyan Ram On Devara Criticism Production Values, Kalyan Ram, Devara, Production

అభిమానులు కూడా ఆ బేనర్లలో వచ్చే సినిమాలను స్పెషల్‌ గా చూస్తారు.ఎన్టీఆర్ ఆర్ట్స్ విషయంలో మాత్రం భిన్నం.ఆ సంస్థలో ప్రొడక్షన్ వాల్యూస్ సరిగా ఉండవని భారీతనం కనిపించదని గీచి గీచి ఖర్చు పెడతారని స్వయంగా నందమూరి అభిమానులే విమర్శిస్తూ ఉంటారు.

Advertisement
Kalyan Ram On Devara Criticism Production Values, Kalyan Ram, Devara, Production

దేవర రిలీజ్ టైమ్ లో కూడా ఇదే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.కళ్యాణ్ రామ్ రిలీజ్‌ కు ముందు గేమ్ ఆఫ్ థ్రోన్స్ సినిమాను మించిన వరల్డ్ క్రియేట్ చేస్తున్నామని అన్నాడు.

తీరా చూస్తే అంత క్వాలిటీ కనిపించలేదు.స్వయంగా నందమూరి అభిమానులే ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ సహ నిర్మాత హరికృష్ణను( Harikrishna ) తీవ్రంగా విమర్శించారు.

ఈ విమర్శల గురించి కళ్యాణ్ రామ్ ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు.తాను ఇలాంటి నెగెటివ్ కామెంట్లను అస్సలు పట్టించుకోనని అతను స్పష్టం చేశాడు.

తన సంస్థ పేరు చెడేలా తాము ఎలా వ్యవహరిస్తామని అతను ప్రశ్నించాడు.

Kalyan Ram On Devara Criticism Production Values, Kalyan Ram, Devara, Production
అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

ఒకవేళ నిజంగా దేవర లో క్వాలిటీ తగ్గి ఉంటే తారక్ ఊరుకుంటాడా అని అన్నాడు.దేవర సినిమా కోసం తామెంత కష్టపడ్డామో తమకే తెలుసని ఎక్కువగా సముద్రం నేపథ్యంలో వాటర్ సీక్వెన్సులే ఉన్న సినిమా తీయడం అంత తేలిక కాదని ఇలాంటి విజువల్స్ తెలుగులో ముందెప్పుడైనా చూశామా అని కళ్యాణ్ రామ్ ప్రశ్నించాడు.జనాలకు ఏదో ఒకటి నెగెటివ్‌ గా మాట్లాడ్డం ఆసక్తి అని కానీ తాను మాత్రం ఎప్పుడూ పాజిటివ్‌ గా ఉండాలని కోరుకుంటానని ఇలాంటి నెగెటివ్ కామెంట్లకు, ప్రశ్నలకు స్పందించడం కూడా తనకు ఇష్టం ఉండదని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు