ముగ్గురు భామలతో రొమాన్స్ చేయబోతున్న కళ్యాణ్ రామ్

నందమూరి ఫ్యామిలీ హీరో కళ్యాణ్ రామ్ ఈ మధ్య కాస్తా స్పీడ్ పెంచాడు.

ఇప్పటి వరకు చేసిన తరహాలో కాకుండా కొత్తదనం ఉన్న కథలని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ నేపధ్యంలో ఇప్పటికే మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బింబుసార అనే టైటిల్ తో సోషియో ఫాంటసీ మూవీని ఎనౌన్స్ చేశాడు.ఈ మూవీ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు.

ఇక టైం ట్రావెల్ పాయింట్ అఫ్ వ్యూలో ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తుంది.

Kalyan Ram Is Going To Have A Romance With Three Wives, Tollywood , Cathein Ther

కళ్యాణ్ రామ్ ఈ మూవీ తన సొంత ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నాడు.ఇదిలా ఉంటే మైత్రీ మూవీ మేకర్స్ లో రాజేంద్ర దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ మూవీలో మూడు విభిన్న పాత్రలలో అతను కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది.

Advertisement
Kalyan Ram Is Going To Have A Romance With Three Wives, Tollywood , Cathein Ther

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కోసం మూడు పాత్రల కోసం ముగ్గురు హీరోయిన్స్ ని ఫైనల్ చేశారు. క్యాథరీన్, సంయుక్త మీనన్ తో పాటు మరో కొత్త హీరోయిన్ ని ఈ మూవీ కోసం ఎంపిక చేసారని తెలుస్తుంది.

సోషియో ఫాంటసీ మూవీతో పాటు మైత్రీ మూవీ షూటింగ్ లని ఒకే సారి స్టార్ట్ చేయడానికి కళ్యాణ్ రామ్ సిద్ధం అవుతున్నాడని టాక్.లాక్ డౌన్ తర్వాత ముందుగా బింబుసార మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత రాజేంద్ర మూవీ స్టార్ట్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు