ట్రైలర్ టాక్: తండ్రి కోసం దేనికైనా రెడీ అంటున్న మంచోడు!

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ఎంత మంచివాడవురా అన్ని పననులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది.

శతమానం భవతి సినిమాతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాతో మరోసారి అదే ఫీట్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అయ్యాడు.

కాగా తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు పలు సినిమాలను మిక్సీలో వేసి తీసిన ట్రైలర్‌లా కనిపించింది.

ముఖ్యంగా శతమానం భవతి ఛాయలు ఈ సినిమాలో ఎక్కువగా కనిపించాయి.అటుపై తండ్రి కోసం దేనికైనా రెడీ అనే కొడుకు పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించాడు.

ఈ పాత్రలో కళ్యాణ్ రామ్ ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి.ఇక సుహాసినీ, శరత్ బాబు లాంటి సీనియర్ నటులు ఈ సినిమాలో చాలా మంది ఉన్నారు.

Advertisement

కళ్యాణ్ రామ్‌ను ప్రేమించే అమ్మాయిగా మెహ్రీన్ నటించింది.విలన్ పాత్రలో రాజీవ్ కనకాల ఓ సరికొత్త లుక్‌లో కనిపించాడు.

మొత్తానికి ఎంత మంచివాడవురా సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కేరాఫ్‌గా మారడమే కాకుండా తండ్రీకొడుకుల అనుబంధాన్ని మనకు చూపించనుంది.సంక్రాంతి బరిలో జనవరి 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు