ఆమె నన్ను తల్లిలా చూసుకుందన్న కళ్యాణ్ రామ్.. భయం వేసినా చేశానంటూ?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు పైకి మంచిగా కనిపించినా వాళ్ల రియల్ బిహేవియర్ వేరు అని టాక్ ఉంది.

అయితే కళ్యాణ్ రామ్ తో స్నేహం చేసిన వాళ్లు మాత్రం ఆయన ఎంతో మంచి వ్యక్తి అని చెబుతారు.

సోషల్ మీడియాకు కళ్యాణ్ రామ్ దూరంగా ఉన్నా తన ఫ్యామిలీకి, అభిమానులకు ఎలాంటి కష్టం వచ్చినా కళ్యాణ్ రామ్ తట్టుకోలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.కళ్యాణ్ రామ్, తారక్ మధ్య మంచి అనుబంధం ఉంది.

అమిగోస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్య్వూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ ఆహా ఓటీటీ నుంచి అన్ స్టాపబుల్ షోకు పిలుపు రాలేదని ఆ రీజన్ వల్లే నేను ఆ షోలో కనిపించలేదని కళ్యాణ్ రామ్ చెప్పారు.అయితే అన్ స్టాపబుల్ సీజన్3 లో మాత్రం కళ్యాణ్ రామ్ కచ్చితంగా కనిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అమిగోస్ కు కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.

Advertisement

అయితే కళ్యాణ్ రామ్ భార్య పేరు స్వాతి కాగా కళ్యాణ్ రామ్ చేతిపై స్వాతి పేరు ఉంటుంది.ఆ పచ్చగొట్టు గురించి కళ్యాణ్ రామ్ స్పందిస్తూ భార్యపై ఉన్న ప్రేమతో ఆ పచ్చబొట్టు వేయించుకున్నట్టు తెలిపారు.చాలా సంవత్సరాల క్రితం తనకు ఆరోగ్య సమస్య వచ్చిందని ఆ సమయంలో స్వాత తల్లిలా సేవలు చేసి కోలుకోవడానికి కారణమయ్యారని కళ్యాణ్ రామ్ అన్నారు.

నాకు సూది అంటే చాలా భయమని టాటూ వేయించుకోవడం వల్ల నాకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్నా తనపై ఇష్టం వల్ల వేయించుకున్నానని రిస్క్ అయినా చేశానని కళ్యాణ్ రామ్ తెలిపారు.అందరికీ భార్యలు సేవలు చేస్తారని అయితే స్వాతి ఎంతో కేర్ తీసుకుందని ఆయన కామెంట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు