కళ్యాణ్ రామ్ అమిగోస్ టార్గెట్ ఎంతంటే..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న సినిమా అమిగోస్.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది.

కళ్యాణ్ రామ్ 3 డిఫరెంట్ రోల్స్ లో నటించిన అమిగోస్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.గురువారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో హయ్యెస్ట్ బిజినెస్ చేసింది.

ఇంతకీ అమిగోస్ ఎంత బిజినెస్ చేసింది అంటే.వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 12 కోట్ల బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది.

థియేట్రికల్ బిజినెస్ మాత్రమే 12 కోట్లు.డిజిటల్, శాటిలైట్ బిజినెస్ డీటైల్స్ ఇంకా బయటకు రాలేదు.

Kalyan Ram Amigos Target , Kalyan Ram , Amigos , Bimbisara , Rajendra Reddy ,
Advertisement
Kalyan Ram Amigos Target , Kalyan Ram , Amigos , Bimbisara , Rajendra Reddy ,

థియేట్రికల్ రన్ లో అమిగోస్ హిట్ అనిపించుకోవాలి అంటే 13 కోట్ల దాకా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.బింబిసార హిట్ తో కెరీర్ లో దూకుడు మీద ఉన్న కళ్యాణ్ రామ్ అమిగోస్ తో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.కళ్యాణ్ రామ్ అమిగోస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని అంటున్నారు.

కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయంతో వస్తున్న అమిగోస్ ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు