నందమూరి హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇక చాలాకాలం తర్వాత ఈయన బింబిసార సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది.ఇక ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ఏకంగా త్విపాత్రభినయంలో నటించిన చిత్రం అమిగోస్.
ఈ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ ప్రేక్షకులను మాత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఈ సినిమా ఫిబ్రవరి 10న గ్రాండ్ లెవల్లో రిలీజ్ అయ్యింది.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడిగా అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమా థియేటర్లో పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమాని మార్చి 10 వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన అధికారక ప్రకటన కూడా వచ్చేసింది.నిత్యం విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అమిగోస్ అంటే స్నేహితులు అని అర్థం.ఇలా ఇందులో ఏకంగా మూడు విభిన్న పాత్రలలో కళ్యాణ్ రామ్ నటించబోతున్నారని తెలియడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.కానీ అనుకున్న స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.
మరి థియేటర్లలో మెప్పించలేకపోయిన ఈ సినిమా ఓటీటీలోనైనా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy