కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్టు..: కిషన్ రెడ్డి

తెలంగాణలోనీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు చేశారు.

మేడిగడ్డ ప్రాజెక్టుపై గొప్పలు చెప్పారన్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి గుదిబండగా మారిందని అన్నారు.

ప్రాజెక్టును కేసీఆర్ నాసిరకంగా నిర్మించారని కిషన్ రెడ్డి ఆరోపించారు.మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగడం నాణ్యతాలోపమేనని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజల సంపదను దోచుకునే ప్రాజెక్టు అని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందన్నారు.

ప్రాజెక్టు మొత్తం అప్పు చేసి నిర్మించారన్న కిషన్ రెడ్డి కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా బయటకు రావడం తెలంగాణ ప్రజల దురదృష్టమని తెలిపారు.

Advertisement
సోమవారం రోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల.. నయం కానీ రోగాల తో పాటు ఇంకెన్నో సమస్యలు దూరం..!

తాజా వార్తలు