నటిగా ఆ విషయంలో ఎప్పుడు భయపడుతూనే ఉంటాను: కాజల్ అగర్వాల్

వెండితెర చందమామగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) గత కొంతకాలంగా ఇండస్ట్రీకి విరామం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.

ఈమె తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకొని ఒక బాబుకు జన్మనివ్వడం వల్ల ఈమె కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.

అయితే ప్రస్తుతం తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్ అగర్వాల్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి కాజల్ తాజాగా అభిమానులతో కలిసి చిట్ చాట్ చేశారు.

ఈ క్రమంలోనే నేటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఈమె సమాధానాలు చెబుతూ వచ్చారు.ఈ చిట్ చాట్ లో భాగంగా ఎంతోమంది నెటిజెన్స్ కాజల్ కుమారుడు( Kajal Aggarwal Son ) గురించి ప్రశ్నలు వేశారు.ఇక నటిగా నెగిటివిటీని ఎలా ఎదుర్కొంటున్నారు కాజల్ సమాధానం చెబుతూ.

నెగిటివిటీ ఎదురైనప్పుడు పాజిటివిటీ పై ఫోకస్ చేయడం అలాగే ధ్యానం చేయడం చేస్తాను.ఇక ఇబ్బంది పెట్టే వ్యక్తులకు తాను దూరంగా ఉంటానని తెలియజేశారు.

Advertisement

ఒక నటిగా మీరు ఎక్కువగా దేనికి భయపడతారు అన్న ప్రశ్న కూడా కాజల్ అగర్వాల్ కు ఎదురయింది.

ఈ ప్రశ్నకు కాజల్ అగర్వాల్ సమాధానం చెబుతూ.ఎంతో అద్భుతమైన ప్రశ్న వేశారు.ఒకనటిగా నేను ఎంపిక చేసుకున్న పాత్రకు తాను సరైన న్యాయం చేయనప్పుడు అభిమానులు మాత్రమే కాకుండా నటిగా నేను కూడా చాలా బాధపడుతూ ఉంటానని.

ఒక నటిగా తాను ఎంపిక చేసుకున్న ప్రతి పాత్రకు 100% న్యాయం చేయాలని ఆలోచిస్తుంటాను.ఇక నేను ఎంపిక చేసుకున్న పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారా లేదా అన్న విషయం గురించి తరచూ తాను భయపడుతూనే ఉంటానని ఈ సందర్భంగా కాజల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్( Allu Arjun ) గురించి కూడా ప్రశ్నలు ఎదురవడంతో తాను చాలా మంచి వ్యక్తి అని ఆయన డాన్స్ ఎనర్జీ( Dance Energy) అంటే తనకు చాలా ఇష్టం అంటూ ఈ సందర్భంగా కాజల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement

తాజా వార్తలు