కాజల్ ని అనవసరంగా డ్రగ్స్ కేసులోకి లాగారా ?

నిన్నటి నుంచి డ్రగ్స్ కేసులో కాజల్ పేరు కూడా వినిపించింది.కారణం కాజల్ మేనేజర్ రోని ఇంట్లో డ్రగ్స్ దొరకడమే.

దాంతో కాజల్ కూడా డ్రగ్స్ వాడుతోందేమో అనే అనుమానాలు మొదలయ్యాయి.కాజల్ మేనేజర్ కాబట్టి, కాజల్ కి ఈ విషయాలు ముందే తెలుసు, రోని చీకటి కార్యకలాపాల గురించి కాజల్ కి ఖచ్చితంగా అవగాహన ఉండే ఉంటుంది, కాజల్ ని కూడా సిట్ విచారిస్తే బాగుంటుంది అనే అభిప్రాయాలు వినిపించాయి.

అయితే ఈ విషయంలో మీడియా వారు కొంచెం ఓవర్ యాక్షన్ చేసారనే చెప్పాలి.ఎందుకంటే రోని కేవలం కాజల్ కి మాత్రమే మేనేజర్ గా వ్యవహరించలేదు.

ఇంకా కొంతమందికి మేనేజర్ పనులు చేసాడు.అందులో రాశి ఖన్నా, లావణ్య త్రిపాఠి లాంటి హీరోయిన్లు కూడా ఉన్నారు.

Advertisement

కాని కాజల్ పేరుతొ కలిపితేనే సంచలనం అవుతుంది కాబట్టి, పాపం కాజల్ కి లింక్ చేసారు.వాస్తవానికైతే ప్రసుతం రోని కాజల్ కి మేనేజర్ గా వ్యవహరించట్లేదు.

కాజల్ తన డేట్స్ తానె మేనేజ్ చేసుకుంటూవస్తోంది.ఆమె తండ్రి కూడా సహాయం చేస్తున్నారు.

కాజల్ చేసే యాడ్స్, డేట్స్ ఆయనే ప్లాన్ చేస్తున్నారు.కాజల్ కేవలం కథలు విని, షూటింగ్ చేసుకుంటోంది.

ప్రసుతం రోని మేఘా ఆకాష్ (నితిన్ లై సినిమా హీరోయిన్ కి మాత్రమె మేనేజర్ గా ఉన్నట్టు సమాచారం.దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏమిటంటే, కాజల్ స్టార్ స్టేటస్ ని వాడుకునేందుకు ప్రయత్నించింది మీడియా.

How Modern Technology Shapes The IGaming Experience
How Modern Technology Shapes The IGaming Experience

తనకు రోనితో ప్రొఫెషనల్ గా తప్ప ఎలాంటి సంబంధం లేదని, తాను చేస్తున్న పనుల పట్ల తనకు ఎలాంటి జ్ఞానం లేదు, అతడి పనులని వెనకేసుకొని రావడం లేదు, ఇలాంటి చేష్టలు సమాజానికి గబ్బు పట్టించేవి, తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కాజల్ వివరించింది.ఇక డ్రగ్స్ కేసులో మిగితా విషయాలు మాట్లాడుకుంటే, ఆర్ట్ డైరెక్టర్ చిన్నాని విచారించారు నిన్న.

Advertisement

ఇతను కూడా పూరి జగన్నాథ్ సన్నిహితుడే.అయితే డ్రగ్స్ విషయంలో పూరి జగన్నాథ్ కి సంబంధించిన ఎలాంటి సమాచారం తనవద్ద లేదని చిన్నా చెప్పారు.

చిన్నాకి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవు.ఇక ఈరోజు ఛార్మీని విచారించనున్న సిట్ అధికారులు, రేపు ముమైత్ ఖాన్ ని ప్రశ్నించనున్నారు.

తాజా వార్తలు