హీరోయిన్‌ను ఫిక్స్‌ చేసిన పవన్‌!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమాపై రోజుకో వార్త పుట్టుకు వస్తోంది.

మొన్నటి వరకు ‘గబ్బర్‌సింగ్‌ 2’ ఉన్న టైటిల్‌ కాస్త తాజాగా ‘సర్దార్‌’గా మారినట్లుగా వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ఈనెల 29 నుండి ప్రారంభించబోతున్నట్లుగా తాజాగా దర్శకుడు బాబీ ప్రకటించాడు.ఈనేపథ్యంలో సినిమాలో నటించే హీరోయిన్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా అనీష ఆంబ్రోస్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయడం జరిగింది.పవన్‌ కోరిక మేరకు ఆమెను ఎంపిక చేశారు.

కాని ఆమెను ఆ తర్వాత తప్పించారు.ఇటీవల పవన్‌తో గతంలో నటించిన హీరోయిన్స్‌లో ఒకరిని తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

Advertisement

దాంతో సమంత లేదా శృతిహాసన్‌లలో ఒకరిని హీరోయిన్‌గా బుక్‌ చేసే అవకాశాలున్నాయని అనుకున్నారు.కాని తాజాగా పవన్‌కు జోడీగా ‘సర్దార్‌’ మూవీలో కాజల్‌ అగర్వాల్‌ను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.

ఇప్పటి వరకు పవన్‌తో ఒక్క సినిమాలో కూడా నటించని కాజల్‌ ఈ ఆఫర్‌తో ఎగిరి గంతేస్తోంది.ఇటీవలే దర్శకుడు బాబీ ఈమెకు కథను వినిపించాడని అంటున్నారు.

ఈ విషయంపై మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

తాజా వార్తలు