బిడ్డకు పాలు ఇవ్వడం కోసం కాజల్ ఇన్ని కష్టాలు పడ్డారా.. తల్లి ప్రేమంటే ఇదేకదా?

సినీ నటి కాజల్ అగర్వాల్ ( Kajal Agarwal )ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే వరస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే సక్సెస్ అందుకున్నటువంటి కాజల్ త్వరలోనే సత్యభామ ( Satyabama ) అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా ఈ నెలాఖరున విడుదల కానుంది.

ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కాజల్ అగర్వాల్ తన బిడ్డ కోసం ఆమె పడిన కష్టాలను తెలిపారు.బాబు పుట్టిన తర్వాత నాకు ముందుగానే కొన్ని కమిట్మెంట్స్ ఉండటం వల్ల షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చిందని తెలిపారు.

ముఖ్యంగా శంకర్ (Shankar)దర్శకత్వంలో ఇండియన్ 2 ( Indian 2 )సినిమా షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాను అని తెలిపారు.కడప దగ్గర ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా నా బాబును మా అమ్మ దగ్గర తిరుపతి( Tirupathi ) లో ఉంచాను.

బాబుకు పాలు పట్టడం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామని తెలిపారు.నేను షూటింగ్ బ్రేక్ సమయంలో క్యారవాన్ లోకి వెళ్లి బాటిల్ లో నా పాలు పట్టించి పాలు పాడవకుండా ఐస్ బాక్స్ లో పెట్టి డ్రైవర్ చేత తిరుపతికి పంపించే దానినని తెలిపారు.

Advertisement

ఇలా రోజుకు రెండుసార్లు తన డ్రైవర్ ఎనిమిది గంటల పాటు ప్రయాణం చేసిన బిడ్డకు పాలు తీసుకువెళ్లారంటూ తాను పడినటువంటి ఇబ్బందులను తెలియజేస్తూ కాజల్ అగర్వాల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇలా తల్లిగా  కొడుకు బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపున నటిగా సినిమాలకు కూడా సమయం కేటాయిస్తూ కాజల్ చాలా బ్యాలెన్స్ గా కెరీయర్ దూసుకుపోతోంది.

2025 సంక్రాంతిని టార్గెట్ చేసిన హీరోలు వీళ్లే.. ఈ హీరోలలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో?
Advertisement

తాజా వార్తలు