ఐటెమ్ సాంగ్ అంటే.. మండిపడుతున్న భామ

కాజల్ తన కెరీర్ లోనే మొదటిసారిగా ఐటం సాంగ్ చేసింది.

ప్లాప్ లతో ఉండి అవకాశాలు లేక విలవిలలాడుతున్న సమయంలో జనతా గ్యారేజ్ లో ఐటం సాంగ్ అవకాశం వచ్చింది ఈ అమ్మడికి.

ఈ సాంగ్ చేసాక అమ్మడి అదృష్టం మారి వరుస అవకాశాలు వస్తున్నాయి.అయితే కాజల్ మాత్రం ఈ పాట ఎందుకు చేసానా అని బాధ పడుతుందట.

ఎందుకంటే కాజల్ మీడియా కి ఎదురు పడగానే ఐటం పాట ఎందుకు చేసారని అడుగుతున్నారట.కాజల్ రుసరుసలాడుతూ ఐటం పాట అనే బదులు స్పెషల్ సాంగ్ అని అనవచ్చు కదా అని అంటోంది.

స్పెషల్ సాంగ్ అంటే బూతు కాదు.అదో క‌మ‌ర్షియ‌ల్ హంగు.

Advertisement

నేనేం ఎక్స్‌పోజింగ్ కోసం ఆ పాట చేయ‌లేదు.క‌థ‌లో ఆ పాట కూడా కీలకం కాబట్టి చేసానని చెప్పింది.

అయినా ఐటం సాంగ్ ఆఫర్స్ వస్తే ఇక ఒప్పుకోనని చెప్పేసింది.ఈ పాట కోసం కాజల్ అక్షరాల 25 లక్షలు తీసుకున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు