సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అధికారులు ఆయనను విచారిస్తున్నారు.

ఇటీవల ఎంపీ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు ప్రతి శనివారం సీబీఐ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన విచారణకు హాజరయ్యారు.కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

జుట్టు రాలకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లైనా ఈ ఆయిల్ వాడండి!
Advertisement

తాజా వార్తలు