మోక్షజ్ఞ ఎంట్రీపై జూనియర్ ఎన్టీఆర్ సంచలన ట్వీట్.. వివాదాలకు చెక్ పెట్టేశారుగా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నందమూరి మోక్షజ్ఞ ( Junior NTR, Nandamuri Mokshajna )మధ్య మంచి అనుబంధం ఉందని ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయిందనే సంగతి తెలిసిందే.

ఏదైనా ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞ కలిసి కనిపిస్తే ఈ ఇద్దరికీ సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటాయి.

అయితే ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజు కాగా ప్రశాంత్ వర్మ ( Prashant Verma )డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ తెరకెక్కుతున్నట్టు క్లారిటీ వచ్చేసింది.సుధాకర్ చెరుకూరి, నందమూరి తేజస్విని( Sudhakar Cherukuri, Nandamuri Tejaswini ) ఈ సినిమాకు నిర్మాతలు కాగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమాలో బాలయ్య సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సైతం గెస్ట్ రోల్ లో కనిపిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.

ప్రశాంత్ వర్మ, బాలయ్య అంగీకరిస్తే గెస్ట్ రోల్ లో కనిపించడానికి ఎన్టీఆర్ వైపు నుంచి అభ్యంతరాలు ఉండవు.మోక్షజ్ఞకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement

సినీ ప్ర‌పంచంలోకి అడుగుపెడుతున్నందుకు మోక్షజ్ఞకు అభినందనలు అని జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న క్ర‌మంలో మోక్షజ్ఞకు అన్ని దైవిక శ‌క్తులతో పాటు తాత‌గారి ఆశీర్వాదంతో ఉంటుందని తారక్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

బాలయ్య ప్రశాంత్ వర్మ మధ్య మంచి అనుబంధం ఉండటం వల్లే మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబో సాధ్యమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి.మోక్షజ్ఞ కోసం అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధమవుతోందని హనుమాన్ మూవీ కంటే ముందుగానే ఈ సినిమా సెట్స్ పైకి రానుందని తెలుస్తోంది.మోక్షజ్ఞ ఫస్ట్ మూవీని భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని భోగట్టా.2026 ఫస్టాఫ్ లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

మోక్షజ్ఞ కెరీర్ ప్లాన్స్ ఎలా ఉంటాయో, ఎంపిక చేసుకునే కథలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.స్టైలిష్ లుక్స్ లో కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న మోక్షజ్ఞ తన యాక్టింగ్ స్కిల్స్ తో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.మోక్షజ్ఞ ఫస్ట్ ఫిల్మ్ కు ప్రశాంత్ వర్మ పర్ఫెక్ట్ ఆప్షన్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

White Hair : తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయిందా.. వర్రీ వద్దు ఈ ఆయిల్ ను వాడితే మీ కురులు మళ్లీ నల్లగా మారడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు