అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. ఏం జరిగిందంటే?

దేవర1 ( Devara1 )బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.

ఈ సినిమా సక్సెస్ గురించి తారక్ నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో స్పందన రాలేదు.

అయితే సినిమా విడుదలై మూడు వారాలు కావడం, ఇప్పటికే ఈ సినిమా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కావడంతో అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.దేవర మూవీ నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం కలిగి ఉంటుందని ఆయన అన్నారు.

ఈ సినిమాలో నటించిన నా సహ నటులకు హృదయ పూర్వక ధన్యవాదాలు అని తారక్ తెలిపారు.వాళ్లు తమ పాత్రలకు ప్రాణం పోసి కథకు జీవం ఇచ్చారని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.

కొరటాల శివకు ధన్యవాదాలు అని ఈ కథను సృష్టించిన ఆయన దిశానిర్దేశంతోనే విజయవంతమైందని తారక్ పేర్కొన్నారు.

Advertisement

అనిరుధ్ మ్యూజీక్, రత్నవేలు( Anirudh Music, Ratnavelu ) సినిమాటోగ్రఫీ, సాబు సార్ ప్రొడక్షన్ డిజైన్, యుగంధర్ ( Yugandhar )గారి విజువల్ ఎఫెక్ట్స్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ తో సినిమాను అద్భుతంగా మలిచారని ఆయన అన్నారు.సినిమాను పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ప్రదర్శకులకు ధనవ్యాదాలు అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.పరిశ్రమ మిత్రులకు ధన్యవాదాలు అని తారక్ తెలిపారు.

నిర్మాతలు సుధాకర్, హరికృష్ణలకు( Sudhakar and Harikrishna ) తారక్ ధన్యవాదాలు తెలియజేశారు.అభిమానులు చూపించే అభిమానమే నన్ను ఈ స్థాయికి చేర్చిందని ఎన్టీఆర్ అన్నారు.అభిమానులు గర్వపడే సినిమాను తీయడానికి ప్రయత్నిస్తానని తారక్ కామెంట్లు చేశారు.

తారక్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు దేవర సినిమా మంచి పేరును తెచ్చిపెట్టడంతో పాటు కలెక్షన్ల విషయంలో కూడా టాప్ లో నిలిచి మంచి లాభాలను అందుకుంది.

ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

సింహాచలం దేవస్థానం ఈవోగా వి త్రినాథ్ రావు
Advertisement

తాజా వార్తలు