Junior NTR : ఆ ఇద్దరు మహిళల వల్లే ఈ స్థాయిలో.. నా భార్య అస్సలు ఒప్పుకోదు.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Young Tiger Jr.NTR )కెరీర్ పరంగా అంచనాలకు మించి సక్సెస్ అయ్యారనే సంగతి తెలిసిందే.

కెరీర్ పరంగా ఎదగాలంటే నైపుణ్యాలతో పాటు తగిన ప్రోత్సాహం కూడా అందాలి.

అయితే ఈ విషయంలో తాను చాలా లక్కీ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెబుతున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో తాను టాప్ హీరోగా రాణించడంలో ఇద్దరు మహిళల పాత్ర కీలకమని ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.

సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ కు పరిచయమయ్యారు.కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి తారక్ ముందడుగులు వేయడం జరిగింది.

ప్రతి కథ వైవిధ్యంతో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న తారక్ అమ్మ ద్వారా తనకు ఈ క్రియేటివిటీ వచ్చిందని చెబుతున్నారు.అమ్మ బాల్యం నుంచి ప్రతి విషయంలో ప్రోత్సహించిందని ఎన్టీఆర్ అన్నారు.

Advertisement

అమ్మ ఇష్ట ప్రకారం బాల్యంలో డ్యాన్స్( Dance ) నేర్చుకున్నానని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

అమ్మ చలవ వల్లే ఈ ప్రపంచం డ్యాన్సర్ గా గుర్తించిందని తారక్ వెల్లడించారు.మన ఆలోచనలను, భావాలను ఎక్స్ ప్రెస్ చేయడానికి డ్యాన్స్ ఒక మార్గమని నేను ఫీల్ అవుతానని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు.నన్ను హోమ్లీ మ్యాన్ గా మార్చిన ఘనత మాత్రం నా భార్య సొంతమని తారక్ అన్నారు.

ప్రణతి తన ఇష్టాలను నాపై రుద్దాలని ఎప్పుడూ అనుకోదని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

ఒక్కరోజు కూడా నేను వ్యాయామం మానకుండా తను ప్రోత్సహిస్తుందని తారక్ తెలిపారు. లక్ష్మీ ప్రణతికి( Lakshmi Pranathi ) కొత్త సినిమాలు చూడటం అంటే ఎంతో ఇష్టమని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న తారక్ దసరా కానుకగా ఈ సినిమాను కచ్చితంగా రిలీజ్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ఆర్.ఆర్.ఆర్ విడుదలై రెండేళ్లు కాగా తారక్ కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు