దివంగత స్టార్ హీరో డైరెక్టర్, నందమూరి తారకరామారావు( Nandamuri Taraka Rama Rao ) గురించి మనందరికీ తెలిసిందే.ఆయన భౌతికంగా మనకు దూరమైనా కూడా ఆయన జ్ఞాపకాలు ఇంకా మన కళ్ళ ముందు మెదులుతూనే.
ఇది ఇలా ఉంటే ఎన్టీ రామారావు శతజయంతి వేళ ఆయన చిత్రంతో ప్రత్యేకమైన రూ.100 నాణెం తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నాణెం ఆవిష్కరణ కార్యక్రమం ఆగస్టు 28వ తేదీన రాష్ట్రపతి భవన్ లో జరగనుంది.
ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు 100 మందిని ఆహ్వానించారు.అయితే ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదట.ఆ సమయంలో ఆయన హైదరాబాద్ లో దేవర షూటింగ్ లో బిజీగా ఉంటారని సమాచారం.
అయితే ఎన్టీ రామారావుకు సంబంధించిన ఇంతటి గొప్ప కార్యక్రమానికి జూనియర్ రాకపోవడం అనే అంశంపై ప్రస్తుత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాల్లో( Senior NTR Centenary Celebrations ) సందర్భంగా హైదరాబాద్లో ఒక సభను పెద్ద ఎత్తున నిర్వహించిన విషయం తెలిసిందే.
సినిమా ఇండస్ట్రీ నుండి చాలా మంది తారలు వచ్చి ఆయన గురించి గొప్పగా మాట్లాడారు.
బాలయ్యతో విబేధాలు ఉన్నా నాగ చైతన్య ని పంపించారు నాగార్జున( Nagarjuna ).అయితే తన పుట్టినరోజు విదేశాల్లో ఫ్రెండ్స్ తో జరుపుకోవడంతో రాలేను అని జూనియర్ నిర్వాహకులకు చెప్పారట.సరే టీడీపీ( TDP ) కి సంబంధించిన కార్యక్రమం కావడంతో రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆలోచన తో దూరంగా ఉన్నారు అనుకోవచ్చు.
అయితే ఈ కార్యక్రమం పూర్తిగా వేరు.పురందేశ్వరి( Daggubati Purandeswari ) అద్వర్యం లో నడిచింది మొత్తం.ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy