దేవరలోని ఆ సీన్స్ లో సీనియర్ ఎన్టీఆర్ ను గుర్తు చేసిన తారక్.. అదరగొట్టారంటూ?

కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) జాన్వి కపూర్ కలిసి నటించిన తాజా చిత్రం దేవర.

( Devara ) తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు సినిమా థియేటర్లకు క్యూ కడుతున్నారు.మిడ్ నైట్ 12 గంటల నుంచి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది.

ఎక్కడ చూసినా కూడా థియేటర్లో వద్ద బయట హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.ఇక స్క్రీన్ పై ఎన్టీఆర్ ప్రత్యక్షమవ్వగానే అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు.

Jr Ntr Devara Public Talk Details, Devara, Devara Public Talk, Tollywood, Jr Ntr

జై ఎన్టీఆర్ నినాదాలతో థియేటర్ మొత్తాన్ని మారుమోగించారు.ఇక థియేటర్లలో సినిమాను చూసిన కొంత మంది అభిమానులు ఆ వీడియోలను క్యాప్చర్ చేసి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్ బుక్ లలో షేర్ చేశారు.ఇకపోతే సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్ తో పాటు ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ మూవీకి హైలెట్ గా నిలిచాయనే టాక్ వినపడుతోంది.

Advertisement
Jr Ntr Devara Public Talk Details, Devara, Devara Public Talk, Tollywood, Jr Ntr

ఆయా సీన్స్ లో ఎన్టీఆర్ కనపరిచిన పెర్ఫార్మెన్స్ లో అయితే అచ్చం సీనియర్ ఎన్టీఆర్ ని( Sr NTR ) చూసినట్టుగా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Jr Ntr Devara Public Talk Details, Devara, Devara Public Talk, Tollywood, Jr Ntr

దేవర, వర అనే రెండు పాత్రల్లో విభిన్న నటనని ప్రదర్శించడమే కాకుండా ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టాడని, మాస్ ప్రేక్షకులకి ఫుల్ మీల్స్ అనే టాక్ అయితే వస్తుంది.ఎన్టీఆర్ పరిచయ సన్నివేశంతో పాటు షిప్ నుండి సరకు దొంగలించే ఎపిసోడ్ కూడా ఆకట్టుకున్నాయనే మాటలు వినిపడుతున్నాయి.మొత్తానికి ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మరొకసారి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరి ముందు ముందు ఈ సినిమా ఇంకా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు