నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో యంగ్ టైగర్.. ప్రభాస్ ఎన్టీఆర్ కాంబో వేరే లెవెల్ అంటూ?

ప్రస్తుత జనరేషన్ లో ఉన్న హీరోలలో ఎలాంటి పాత్రనైనా పోషించి ప్రేక్షకులను మెప్పించగల నటుడు ఎవరు అంటే అందులో ముందుగా జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) పేరు వినిపిస్తూ ఉంటుంది.

ఇప్పటికే ఎన్నో రకాల పాత్రలు పోషించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు ఎన్టీఆర్.

అయితే ఇప్పుడు భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్( Netaji Subhash Chandra Bose ) పాత్రలో నటించనున్నాడనే వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.ఏంటి నిజమా అని ఆశ్చర్యపోతున్నారా!

Jr Ntr As Netaji Subhas Chandra Bose Details, Jr Ntr, Prabhas, Subash Chandra Bo

అవునండోయ్ ఇదే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హార్ట్ గా మారింది.ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో దేవర సినిమాతో( Devara ) పాటుగా వార్ 2, డ్రాగన్ సినిమాలో ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమాలతో పాటుగా ప్రభాస్( Prabhas ) అప్ కమింగ్ మూవీలో నేతాజీ పాత్ర పోషించడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

హను రాఘవపూడి( Hanu Raghavapudi ) దర్శకత్వంలో ప్రభాస్ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.ఇప్పటికీ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు కూడా వినిపించాయి.అయితే ఈ చిత్రానికి ఫౌజీ( Fauji ) అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
Jr Ntr As Netaji Subhas Chandra Bose Details, Jr Ntr, Prabhas, Subash Chandra Bo

భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందునాటి కథతో ఈ చిత్రం రూపొందుతోంది.

Jr Ntr As Netaji Subhas Chandra Bose Details, Jr Ntr, Prabhas, Subash Chandra Bo

1943 ప్రాంతంలో సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ లో ఒక సైనికుడిగా ప్రభాస్ కనిపిస్తాడట.అంతేకాదు ఈ సినిమాలో నేతాజీ పాత్ర కూడా కాసేపు కనిపిస్తుందట.నేతాజీ పాత్రను ఎన్టీఆర్ లాంటి స్టార్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మూవీ టీం ఆయనను సంప్రదించగా ఈ రోల్ చేయడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ అంటే హను రాఘవపూడికి ప్రత్యేక అభిమానం.గతంలో ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ప్రయత్నించాడు కానీ ఎందుకనో సాధ్యం కాలేదు.దాంతో అయితే ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ పాత్రకి ఎన్టీఆర్ సరిగ్గా సరిపోతాడని భావించి హను రాఘవపూడి అడగటం ఎన్టీఆర్ ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయని అంటున్నారు.

అయితే ఒకవేళ అదే నిజమైతే నేతాజీగా ఎన్టీఆర్, సైనికుడిగా ప్రభాస్ స్క్రీన్ మీద కనిపిస్తే కన్నుల పండుగలా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!
Advertisement

తాజా వార్తలు