త్రివిక్రమ్‌ రేంజ్‌ ఏమాత్రం తగ్గలేదు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందిన పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.

పవన్‌ 25వ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకం అంటూ త్రివిక్రమ్‌ అతి జాగ్రత్తలు తీసుకోవడం కారణమో లేదంటే మరేంటో కాని అజ్ఞాతవాసి చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌గా నిలిచింది.

ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనాలతో ఆ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యింది.ఆ చిత్రం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.

దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్దం అవుతుంది.

ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిర్రతంను దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రంపై అజ్ఞాతవాసి ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని అంతా భావించారు.

Advertisement

అయితే త్రివిక్రమ్‌ క్రేజ్‌ ఒక్క సినిమాతో పోయేది కాదని, ఆయన క్రేజ్‌ శిఖరం అంత ఎత్తు అంటూ తాజాగా నమోదు అవుతున్న లెక్కలు చెప్పకనే చెబుతున్నాయి.ప్రస్తుతం చేస్తున్న చిత్రం అన్ని ఏరియాల్లో కలిపి ఏకంగా 75 కోట్లకు పైగా బిజినెస్‌ను నమోదు చేయడం జరిగింది.

స్టార్‌ హీరోల సినిమాలు ఈమద్య కాలంలో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ 50 నుండి 60 కోట్ల వరకు నమోదు అవ్వడం సర్వ సాదారణం.అయితే భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న చిత్రాలకు మాత్రమే 75 కోట్ల బిజినెస్‌ సాధ్యం అవుతుంది.

ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రారంభం అయిన ఈ చిత్రం ప్రస్తుతం భారీ అంచనాలను మూట కట్టుకుంది.ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌తో పాటు, ఇప్పటికే సినిమా గురించి వచ్చిన వార్తల నేపథ్యంలో సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.

అందుకే అన్ని ఏరియాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ నటించిన ఏ చిత్రం కూడా ఆంధ్రా ఏరియాలో 40 కోట్ల బిజినెస్‌ను సాధించిన దాఖలాలు లేవు.

మీ దంతాలు పసుపు రంగులో అసహ్యంగా కనిపిస్తున్నాయా? ఇలా చేస్తే ముత్యాల్లా మెరుస్తాయి!

కాని మొదటి సారి ఎన్టీఆర్‌ అరవింద సమేత చిత్రం కేవలం ఆంధ్రా ఏరియాలో ఏకంగా 40 కోట్ల బిజినెస్‌ను చేయడం జరిగింది.ఇక నైజాం మరియు సీడెడ్‌లో 35 కోట్ల మేరకు బిజినెస్‌ అయినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

Advertisement

దాంతో పాటు శాటిలైట్‌ రైట్స్‌, ఆన్‌లైన్‌ రైట్స్‌, ఆడియో రైట్స్‌, ప్రైమ్‌ వీడియో రైట్స్‌ ఇలా అనేక రకాల రైట్స్‌ రూపంలో మరో 30 కోట్ల మేరకు నిర్మాత ఖాతాలో పడే అవకాశం ఉందని తెలుస్తోంది.మొత్తానికి 105 కోట్లు సినిమా విడుదల కాకుండానే నిర్మాతకు దక్కే అవకాశం ఉంది.

తాజా వార్తలు