టీడీపీతో చెట్టాప‌ట్టాల్‌... ప‌వ‌న్‌కు ఫోన్లో క్లాస్ పీకిన న‌డ్డా ?

బీజేపీ-జ‌న‌సేన పొత్తు విష‌యం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది.ఇటీవ‌ల ముగిసిన స్థానిక సంస్త‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బీజేపీ-జ‌న‌సేన క‌లిసి మ‌ద్ద‌తు దారుల‌ను రంగంలోకి దించాల‌ని అనుకున్నాయి.

అయితే.అనూహ్యంగా ఈ ప్ర‌యత్నం విక‌టించింది.కొన్ని చోట్ల జ‌న‌సేన ఒంట‌రి పోరు చేసింది.

మ‌రికొన్ని చోట్ల బీజేపీతో క‌లిసి ప‌నిచేసింది.అయితే.

ఎక్క‌వ పంచాయ‌తీల్లో జ‌న‌సేన‌.లోపాయికారీగా టీడీపీతో స‌ర్దుబాటు చేసుకుని ముందుకు సాగింది.టీడీపీకి బ‌లం ఎక్కువ‌గా ఉన్న చోట‌.

Advertisement

జ‌న‌సేన‌.జ‌న‌సేన అభ్య‌ర్థులు బ‌లంగా ఉన్నార‌ని భావించిన చోట టీడీపీ స‌ర్దుబాటు ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించాయి.

ప‌లితంగా బీజేపీ గెలుస్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్న పంచాయ‌తీల్లో టీడీపీ విజ‌యం సాధించింది.ఈ ప‌రిణామంపై రాష్ట్ర‌బీజేపీ పెద్ద‌లు హుటాహుటిన స‌మావేశ మ‌య్యారు.టీడీపీ-జన‌సేన‌.

అంత‌ర్గ‌త పొత్తులు.లోపాయికారీ.

ఒప్పందాల‌పై చ‌ర్చించారు.పైగా వివిధ మీడియాల్లో వ‌చ్చిన వార్త‌ల‌ను కూడా స‌మీక‌రించుకుని.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు..!!

త‌మ వాద‌న‌ను జాతీయ బీజేపీ అధ్య‌క్షుడు న‌డ్డాకు నివేది క రూపంలో అందించారు.దీనిని ఆచితూచి ప‌రిశీలించిన‌ట్టు రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు స‌మాచారం అందింది.

Advertisement

ఈ విష‌యంలో త‌మ పొత్తు నిబంధ‌న‌ల‌ను జ‌న‌సేన విస్మ‌రించింద‌ని.జ‌న‌సేన‌ను తాము ఆది నుంచి కూడా అత్యంత విశ్వ‌స‌నీయ పార్టీ అని చెప్పక‌పోవ‌డానికి కార‌ణం ఇదేన‌ని రాష్ట్ర బీజేపీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక‌, కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు.ఏకంగా.జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పోన్ చేసి.

మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌పై చ‌ర్చించిన‌ట్టు బీజేపీ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు.అయితే.

దీనికి సంబంధించి.స్థానికంగా జ‌రిగిన ప‌రిణామాల‌పై తాము కూడా చ‌ర్చిస్తున్నామ‌ని.

ఇది ఎలా జ‌రిగిందో కూడా త‌మ‌కు తెలియ‌ద‌ని.పార్టీ గుర్తుపై జ‌రిగే ఎన్నిక‌లు కావు క‌నుక‌.

తాము కూడా ఏం జ‌రిగింద‌నే విష‌యంపై దృష్టి పెడుతున్నామ‌ని.ప‌వ‌న్ వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం.

అయితే.ఇది ఉద్దేశ పూర్వ‌కంగా జ‌రిగిందా?  లేక యాదృచ్ఛికంగా జ‌రిగిందా? అనేవిష‌యాన్ని బీజేపీ నేత‌లు తేల్చ‌నున్నార‌ని స‌మాచారం.ఇక‌, ప్ర‌స్తుతం స్థానిక మునిసిపాలిటీ, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ జ‌నసేన‌-టీడీపీ నాయ‌కులు.

ఓ అవ‌గాహ‌న మేర‌కు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.బీజేపీ నేత‌లు కుత‌కుత‌లాడుతున్నారు.

ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన గురించి వారు.బీజేపీ గురించి.

జ‌న‌సేన నాయ‌కులు మౌనంగా ఉన్నారు.ఈ మౌనం ఎటు దారితీస్తుందో చూడాలి.

తాజా వార్తలు