రూ.808 కోట్లకు నోబెల్ ప్రైజ్‌ను వేలం వేస్తున్న జర్నలిస్ట్.. కారణం తెలిస్తే!

ఉక్రేనియన్ బాల శరణార్థుల బాగోగుల నిమిత్తం నగదు సేకరించాలని రష్యన్ జర్నలిస్ట్ డిమిత్రి మురాటోవ్ నడుం బిగించారు.ఇందులో భాగంగా ఆయన సోమవారం నాడు తాను గెలుచుకున్న నోబెల్ శాంతి బహుమతిని వేలం వేశాడు.

కాగా ఈ నోబెల్ ప్రైజ్ సోమవారం రాత్రి 103.5 మిలియన్ డాలర్లకు విక్రయించబడింది.అంటే మన డబ్బుల్లో రూ.808 కోట్లను ఈ నోబెల్ ప్రైజ్‌ను అమ్మడం ద్వారా సంపాదించాడు రష్యన్ జర్నలిస్ట్.ఈ వేలాన్ని హెరిటేజ్ ఆక్షన్ నిర్వహించింది.

అయితే దీనిని ఎవరు సొంతం చేసుకున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.దీనిని రష్యన్ కాకుండా ఒక విదేశీయుడు కొన్నట్లు తెలుస్తోంది.

మురాటోవ్, అక్టోబర్ 2021లో బంగారు పతకం అందుకున్నాడు.మురటోవ్ గతేడాది నోబెల్ శాంతి బహుమతిని ఫిలిప్పీన్స్‌కు చెందిన జర్నలిస్టు మరియా రెస్సాతో కలిసి గెలుచుకున్నాడు.

వేధింపులు, చావు బెదిరింపుల ఎదురైనప్పటికీ వీరు ఉన్నది ఉన్నట్లుగా రిపోర్ట్ చేసి గొప్ప జర్నలిస్టులుగా పేరు సంపాదించారు.తమ తమ దేశాలలో వాక్ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడానికి వీరు చేసిన పోరాటాలకు యావత్ ప్రపంచం హ్యాట్సాఫ్ చెప్పింది.

Advertisement

ఇకపోతే మురాటోవ్ మెడల్‌లో ఉన్న 175 గ్రాముల 23 క్యారెట్ బంగారం విలువ దాదాపు 10,000 డాలర్ల వరకు ఉంటుంది.

రష్యా చేస్తున్న యుద్ధం వల్ల ఉక్రెయిన్ దేశ ప్రజలు తమ ఇల్లు, వాకిలి వదిలేసి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.ముఖ్యంగా బాలబాలికలు,ఆడవారు పెద్ద ఎత్తున వలసపోతున్నారు.ఇప్పటికే ఒక కోటి 30 లక్షలకు పైగా ప్రజలు తమ దేశాన్ని విడిచి వెళ్లినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.

అయితే ఇలా వెళ్లిన బాల శరణార్ధుల కోసం డబ్బు సేకరించేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు.ఇందులో భాగంగా రష్యన్ జర్నలిస్టు వినూత్న ఆలోచన చేసి భారీ ఎత్తున డబ్బు సేకరించగలిగాడు.

ఆ డబ్బుతో ఇప్పుడు ఉక్రెయిన్ పిల్లల జీవితం కాస్తయినా మెరుగుపడుతుంది.

Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown
Advertisement