రాకేశ్ కు ఇచ్చిన కట్నం గుట్టు విప్పిన సుజాత.. ఏడు జన్మలకు అతనే నా భర్తంటూ?

జోర్దార్ సుజాత ( Jordar Sujata )గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షో( Jabardasth Show ) ద్వారా ఆమె ఊహించని స్థాయిలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

సుజాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాకేశ్( Rakesh ) ఎన్నో కష్టాలను అనుభవించారని అవి చెప్పలేనని ఆమె అన్నారు.ఎంతో కష్టపడి, ఎన్నో అనుభవించడం వల్లే రాకేశ్ ఇప్పటికీ టీమ్ లీడర్ గా కొనసాగుతున్నారని సుజాత వెల్లడించారు.

టీమ్ లీడర్ స్థాయికి చేరుకోవడం సులువు కాదని ఆమె పేర్కొన్నారు.చాలా కష్టపడితే మాత్రమే ఆ స్థాయికి చేరుకోవడం సాధ్యమవుతుందని సుజాత తెలిపారు.

రాకేశ్ ఒంటరి పోరాటం చేశాడు కాబట్టి ఆ కష్టం ఇంకొంచెం ఎక్కువే ఉంటుందని సుజాత పేర్కొన్నారు.పెళ్లైన తర్వాత కూడా రాకేశ్ టీమ్ లో కొనసాగుతున్నానని ఆమె తెలిపారు.

Advertisement

మొన్న లేడీ గెటప్ వేసుకొని కొట్టుకున్నామని సుజాత వెల్లడించారు.కొట్టడం అయిపోయిన తర్వాత సారీ చెప్పానని ఆమె పేర్కొన్నారు.

రాకేశ్ రెమ్యునరేషన్ ఇస్తాడని ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ సుజాత చెప్పుకొచ్చారు.తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని సుజాత చెప్పుకొచ్చారు.అమౌంట్ విషయంలో రాకేశ్ ఎప్పుడూ ఇబ్బంది పెట్టరని ఆమె తెలిపారు.

పెళ్లికి ముందే రాకేశ్ చాలా బహుమతులు ఇచ్చాడని ఆమె పేర్కొన్నారు.రాకేశ్ కు కట్నం ఏమీ ఇవ్వలేదని సుజాత పెర్కొన్నారు.

పాపం బిడ్డ తీసుకోలేదని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!

నీకు కావాలంటే నువ్వు ఇప్పుడే అడుగు అని నేను చెప్పానని సుజాత తెలిపారు.పెళ్లి తర్వాత అడిగితే ఇవ్వనని చెప్పానని సుజాత అన్నారు.మమ్మీ, డాడీ, ముగ్గురం సిస్టర్స్ అని సుజాత తెలిపారు.

Advertisement

పెళ్లికి మా వాళ్లు పెట్టాల్సినవి కూడా తనే పెట్టాడని ఆమె అన్నారు.ఏడు జన్మలకు రాకేశ్ నాకేనని ఆమె కామెంట్లు చేశారు.

తాజా వార్తలు