సీఎం జగన్‎ను కలిసిన ఉద్యోగ సంఘాలు

ఏపీ సీఎం జగన్‎ను ఉద్యోగ సంఘాలు కలిశాయి.

కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తో పాటు జీపీఎస్ ప్రకటించడంపై సీఎం జగన్‎కు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని తెలిపారు.సర్కార్ నుంచి జరగాల్సిన మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తామన్నారు.

ఉద్యోగుల మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.సీపీఎస్ లో లేనివి జీపీఎస్ లో ఉన్నాయని వెల్లడించారు.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

తాజా వార్తలు