బీఆర్ఎస్‎లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి

భువనగిరి నియోజకవర్గానికి చెందిన కీలక నేత జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.

అనంతరం జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు.ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నారు.

ఈ క్రమంలోనే ఉద్యమ నాయకులకు, జేఏసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నానన్న ఆయన అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.అయితే గతంలో బీఆర్ఎస్ లో యువజన విభాగం అధ్యక్షుడిగా పని చేసిన జిట్టా 2009లో భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు.

అయితే టికెట్ రాకపోవడంతో పార్టీని వీడారన్న సంగతి తెలిసింది.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, ఆదివారం 2023